మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ ఎంతోమంది మహిళలు వరకట్న వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్‌కు అనే యువకుడికి శశి అనే యువతితో 5 నెలల క్రితం వివాహం జరిగింది.వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు సుమారు 10 లక్షల మేర ఖర్చు చేసి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లయిన ఐదు నెలలకే వీరేంద్ర కొత్త కారు కొనాలని అందుకోసం తమ తల్లిదండ్రుల వద్ద మరో మూడు లక్షల రూపాయలు కట్నం తేవాలని శశిని వేధించేవాడు.ఈ క్రమంలోనే ఆమె పెళ్లి కోసమే తమ తల్లిదండ్రులు ఎంతో అప్పు చేశారని మరి కట్నం కావాలంటే ఎక్కడినుంచి తెస్తారని తన భర్తతో వివాదానికి దిగింది.
ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరి వీరేంద్ర తన భార్య శశిని గొడ్డును బాదినట్టు బాది తన చేత యాసిడ్ తాగించాడు. యాసిడ్ తాగడం వల్ల అపస్మారకస్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రిలో చేర్పించాడు. యాసిడ్ తాగడం వల్ల ఆమె శరీరంలోని భాగాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆమెకు తరచూ రక్తపు వాంతులు అవుతున్నాయని తన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యవహారంపై DCW చీఫ్ స్వాతిమాలివాల్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖరాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…