కొందరు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవ చేసేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. అందువల్లే ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకు ఎల్లప్పుడూ చిన్నచూపు ఉంటుంది. కానీ ఆయన మాత్రం అలా కాదు. ఒక వృద్ధురాలికి ఫించను ఇచ్చేందుకు నెల నెలా ఏకంగా 25 కిలోమీటర్ల పాటు కొండలపై ప్రయాణించి సాహసం చేస్తున్నారు. ఆయనే తమిళనాడుకు చెందిన పోస్ట్ మాస్టర్ ఎస్.క్రీస్తురాజా.
క్రీస్తురాజా వయస్సు 55 ఏళ్లు. తమిళనాడులోని పాపనాశం అప్పర్ డ్యామ్ బ్రాంచ్‌కు పోస్టు మాస్టర్. ఆయన ఒక్కరే అందులో ఉంటారు. పోస్టాఫీస్ మొత్తాన్ని ఆయనే నిర్వహిస్తారు. అయితే అక్కడి కలక్కడ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కొండ ప్రాంతంలో 110 ఏళ్ల కుట్టియమ్మాల్ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు నెల నెలా రూ.1000 ఫించను వస్తుంది. దాన్ని అందించేందుకు క్రీస్తురాజా నెలకు ఒకసారి ఆదివారం రోజు పర్వతాల్లో 25 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ఫించను అందిస్తుంటారు.
ఆదివారం అయితే సెలవు కనుక ఆయన నెలలో ఏదైనా ఒక ఆదివారం రోజు ఉదయాన్నే 7 గంటలకు ప్రయాణం అవుతారు. సాయంత్రం వరకు ఆమె వద్దకు చేరుకుంటారు. ఆమెకు ఫించన్ అందజేసి మళ్లీ వెనక్కి వస్తారు. ఇందుకు ఆయనకు ఒక రోజు పడుతుంది. ఆయన వయస్సు 55 ఏళ్లు అయినప్పటికీ ఓ వృద్ధురాలికి ఫించను అందజేయాలనే తలంపుతో ఆయన ఆ సాహసం చేస్తున్నారు. దీంతో అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…