ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ఓ ప్రత్యేకమైన సేల్‌ను నిర్వహించిన విషయం విదితమే. అయితే మళ్లీ ఇంకో సేల్‌ను ఆగస్టు 5 నుంచి నిర్వహించనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక ఆఫర్లను అందివ్వనున్నారు.
ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. సేల్‌లో రోజూ రాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకమైన డీల్స్ ఉంటాయి. అర్థరాత్రి 2 గంటలకు కూడా ప్రత్యేకంగా సేల్‌లను నిర్వహిస్తారు.
ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా రేజర్ ఫోన్‌ను రూ.11వేల తగ్గింపు ధరతో రూ.54,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్ 11 రూ.5901 తగ్గింపుతో రూ.48,999 ధరకు, అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 3 రూ.7వేల తగ్గింపుతో రూ.39,999 ధరకు, ఐఫోన్ ఎక్స్ఆర్ రూ.8901 తగ్గింపుతో రూ.38,999 ధరకు లభిస్తున్నాయి.
సేల్‌లో భాగంగా యాపిల్ వాచ్ సిరీస్ 3, ఇతర యాపిల్ వాచ్‌లను రూ.16,900 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. హానర్ మాజిక్ వాచ్ 2 రూ.3వేల తగ్గింపుతో రూ.9,999 ధరకు లభిస్తోంది. అమేజ్‌ఫిట్ టి-రెక్స్ వాచ్ రూ.3500 తగ్గింపుతో రూ.6499కు, అమేజ్‌ఫిట్ జీటీఎస్ రూ.500 తగ్గింపుతో రూ.5499కు లభిస్తున్నాయి.
సేల్‌లో ట్యాబ్‌లపై 45 శాతం, స్టోరేజ్ డివైస్‌లపై 75 శాతం, పవర్ బ్యాంకులపై 70 శాతం, హెడ్ ఫోన్లు, స్పీకర్లపై 70 శాతం, మానిటర్లపై 40 శాతం, బెస్ట్ సెల్లింగ్ టీవీలపై 64 శాతం, ఇతర టీవీలపై 56 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. స్ట్రీమింగ్ డివైస్‌లను రూ.1645 ప్రారంభ ధరకు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రూ.49,900 ప్రారంభ ధరకు, ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్‌లను రూ.33,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో రూ.5వేలు ఆపైన విలువైన వస్తువుల కొనుగోలుపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…