రోడ్లను సరైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మించకపోతే కొద్ది రోజులకే వాటిపై గుంతలు ఏర్పడుతుంటాయి. వాహనాలు తిరిగే కొద్దీ, వర్షాలకు రోడ్లు దెబ్బ తింటాయి. ఈ క్రమంలో రోడ్లపై ఏర్పడే గుంతల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తుంటారు. ఇక యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. అయితే రోడ్లపై ఉన్నగుంతలను పూడ్చమని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోరు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. కానీ ఆ జంట మాత్రం వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగిస్తున్నారు. గత 11 సంవత్సరాలుగా వారు రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన 73 ఏళ్ల గంగాధర్ తిలక్ రోడ్ డాక్టర్‌గా పేరు గాంచారు. ఆయన తన భార్య వెంకటేశ్వరితో కలిసి గత 11 ఏళ్లుగా రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. తిలక్ 35 ఏళ్ల పాటు రైల్వేలో ఉద్యోగిగా పనిచేశారు. తరువాత హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఆ తరువాత 1 ఏడాది పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశారు. అయితే రహదారులపై ఉన్న గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకుని వాటిని పూడ్చేందుకు నడుం బిగించారు. అలా 11 సంవత్సరాల నుంచి ఆయన, తన భార్యతో కలిసి ఇప్పటి వరకు 2030 వరకు గుంతలను పూడ్చారు.
తనకు వచ్చే పెన్షన్ మొత్తంతో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో గుంతలను పూడ్చేందుకు అవసరమైన సామగ్రి, పనిముట్లు ఉంటాయి. వాటితో గుంతలను పూడుస్తున్నారు. అందుకనే తిలక్‌కు రోడ్ డాక్టర్‌గా పేరు వచ్చింది. అయితే మొదట్లో గుంతలను పూడ్చమని అధికారులకు వారు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో ఆ దంపతులే స్వయంగా రంగంలోకి దిగారు. అప్పటి నుంచి రోడ్లపై గుంతలను పూడుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల్లో చలనం వచ్చింది. రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అవసరమైన సామగ్రిని వారు ఆ దంపతులకు అందజేస్తున్నారు. ఏది ఏమైనా తిలక్ లాంటి వ్యక్తులు సమాజంలో ఇంకా ఉన్నారు కాబట్టే ప్రజలకు సహాయం అందుతోంది. ఆయన చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…