సమాజంలో ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేస్తారు. తమ తాహతుకు తగినట్లుగా కొందరు దానం చేస్తారు. కొందరు అస్సలు ఏమీ ఉంచుకోకుండా సంపాదించేది మొత్తం దానం చేస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కూడా సరిగ్గా అలాంటి కోవకే చెందుతారు. ఆయనే.. తమిళనాడుకు చెందిన పాలమ్ కల్యాణ సుందరం. ఈయన ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. అయినప్పటికీ తాను యుక్త వయస్సులో ఉద్యోగం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు 36 ఏళ్లుగా తాను సంపాదించేది మొత్తం దానం చేస్తూనే ఉన్నారు.
కల్యాణ సుందరం ది తమిళనాడు రాష్ట్రం. నిరుపేద కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడు తండ్రి మరణించాడు. దీంతో తల్లి ఆయనను పెంచి పెద్ద చేసింది. ఉన్నదాంట్లో నుంచి పేదలకు సహాయం చేయాలనే గుణాన్ని ఆయన తన తల్లి నుంచి అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన లిటరేచర్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక లైబ్రేరియన్‌గా ఉద్యోగం సాధించాడు. లైబ్రరీ సైన్స్‌లోనూ ఈయన గోల్డ్ మెడలిస్టు.
అయితే కల్యాణ సుందరం పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయన ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి తనకు నెల నెల వచ్చే మొత్తం జీతాన్ని పేదలకు దానం చేసేవారు. ఎక్కువగా చారిటీలకు ఆయన జీతాన్ని విరాళంగా ఇస్తూ వస్తున్నారు. ఇక రిటైర్ అయ్యాక కూడా తనకు లభించిన బెనిఫిట్స్ తాలూకు సొమ్మును ఆయన చారిటీలకు అందజేశారు. ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి.
కేంద్ర ప్రభుత్వం కల్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్‌గా గుర్తించి సత్కరించింది. అమెరికా ప్రభుత్వం ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మిలీనియం అవార్డును అందజేయగా, కేంబ్రిడ్జి ది ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్థ వారు ఆయనను అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించారు. ఇక ఐక్యరాజ్యసమితి ఆయనను 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించింది. సమాజంలో నిజంగా ఇలాంటి వారు ఎక్కడో ఒకరు ఉంటారు. వీరి వల్ల పేదలకు ఆసరా లభిస్తోంది. ఇన్ని సేవలు చేసినందుకు, ఇంతటి ఘనత సాధించినందుకు ఈయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…