Couple : వివాహంతో రెండు శరీరాలు మాత్రమే కాదు, రెండు మనస్సులు కూడా ఒక్కటవుతాయి. దీంతో దంపతులిద్దరూ జీవితాంతం అలా ఒకే మనస్సులా మారి జీవిస్తారు. ఎలాంటి కష్ట, నష్టాలు వచ్చినా, సుఖం, దుఃఖం కలిగినా ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆదర్శ దాంపత్యం అంటారు. ఇలాంటి దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు మేం చెప్పబోయే పలు సూచనలు కూడా ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి వర్తిస్తాయి. వారు ఈ టిప్స్‌ను తెలుసుకుని దంపతులు ఇద్దరూ వాటిని తమ దాంపత్య జీవితంలో పాటిస్తే దాంతో లైఫ్ ఈజీ అవుతుంది. ఆదర్శ దంపతులుగా ఉండవచ్చు. మరి నవ వధూవరులకే కాదు, భార్య భర్తలకు కూడా వర్తించే ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
1. కెరీర్ కన్నా కుటుంబ సభ్యులే ముఖ్యమని భావించాలి. కుటుంబ సభ్యుల సౌకర్యం, వీలు అంతా ఓకే అనుకుంటేనే కెరీర్ చూసుకోవాలి. కుటుంబంలో అందరూ ఎలాంటి కలహాలు లేకుండా ఉండాలి. ఎలాంటి నష్టాలు వచ్చినా కుటుంబాన్ని వదలకూడదు. దాంతోపాటు కెరీర్‌ను చూసుకోవాలి.
2. దంపతులిద్దరూ పనిచేసే వారు అయితే ఇద్దరూ అన్నింటినీ షేర్ చేసుకోవాలి. అంటే.. రెంటు, బిల్స్, ఇతర ఖర్చులు లాంటివన్నమాట. ఈ విషయంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భావన రాకూడదు. ఇద్దరూ సమానంగా ఖర్చు పెట్టాలి.
3. దంపతులన్నాక ఇద్దరికీ తల్లిదండ్రులు ఉంటారు. వారిని తమ వారుగా వారు భావించాలి. యువతి తల్లిదండ్రులను యువకుడు, యువకుడి తల్లిదండ్రులను యువతి తమ సొంత వారిలా భావించి చూసుకోవాలి. దీంతో దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు రావు.
4. ఇంటికి సంబంధించిన ఏ విషయమైనా ఇద్దరూ మనది అని భావించాలి. అందుకు స్పందించాలి. కేవలం ఒక్కరు మాత్రమే అలా భావించరాదు.
5. ఏ సమస్య వచ్చినా దంపతులిద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి. అది చిన్న సమస్య అయినా సరే. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. వస్తే అది విడిపోవడానికి దారి తీస్తుంది.
6. పడక గది అంటే శృంగారానికి మాత్రమే వాడాలి. ఇతర ఏ విషయాలను చర్చించరాదు. ఆఫీసు, ఇల్లు, కుటుంబ సభ్యులు.. ఇలా ఏ విషయాన్నయినా అక్కడ చర్చించరాదు. అక్కడ కేవలం ఆ పనులు మాత్రమే జరగాలి.
7. దంపతులన్నాక అప్పుడప్పుడూ పలు విషయాల్లో ఇద్దరికీ ఏకాభిప్రాయం రాకపోవచ్చు. అంతమాత్రాన గొడవ పడకూడదు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి.
8. ఆహారం విషయంలోనూ కచ్చితంగా ఉండాలి. ఒకరికి నచ్చినవే వండి తినరాదు. ఇద్దరూ ఇష్టాఇష్టాలను పంచుకుని అందుకు అనుగుణంగా తమకు ఇష్టమైన రుచులను ఆస్వాదించాలి.
9. కొన్ని సార్లు పలు విషయాల్లో దంపతులిద్దరూ తీవ్రంగా స్పందిస్తుంటారు. అలా జరగకూడదు. చిన్న విషయమైనా సరే మరీ అంత డీప్‌గా వెళ్లకూడదు.
10. ఎంత దంపతులైనా, ఒకే జీవితం జీవిస్తున్నా వారు మనుషులే కదా. కనుక ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది. దాన్ని దంపతులిద్దరూ గౌరవించుకోవాలి. కానీ సీక్రెట్స్ మాత్రం మెయింటెయిన్ చేయకూడదు. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిస్తేనే మంచిది.
11. భార్యాభర్తల రిలేషన్ షిప్‌లో ఎప్పుడూ ఒకరిపై మరొకరికి గౌరవం తగ్గకూడదు. అది అలాగే మెయింటెయిన్ చేయాలి.
12. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ భార్యాభర్త ఇద్దరి ప్రమేయం ఉండాలి.
13. అప్పుడప్పుడూ ఫ్యామిలీ అంతా కలిసి టూర్లకు వెళ్లాలి. విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తే కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి.
14. భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త, భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి. వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం కలిగి ఉండరాదు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…