ముఖ్య‌మైన‌వి

Salt : కొద్దిగా ఉప్పు తీసుకుని ఇంట్లో అక్క‌డ‌క్క‌డా చ‌ల్లితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Salt : ఇప్పుడంటే మ‌నం దేన్న‌యినా శుభ్రం చేయాలంటే వ‌స్తువుకు తగిన‌ట్టుగా ర‌క ర‌కాల స్ప్రేలు, పౌడ‌ర్ల‌ను వాడుతున్నాం. కానీ మీకు తెలుసా..? ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు కేవలం ఉప్పుతోనే ఆయా వ‌స్తువుల‌ను ఎంతో శుభ్రం చేసుకునే వారు. అవును, ఉప్పే. ఎందుకంటే అందులో ఉండే ప‌లు గుణాల వ‌ల్ల ఉప్పును అనేక విధాలుగా శుభ్రం చేసే కార‌కంగా మ‌న వాళ్లు ఉప‌యోగిస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలో ఉప్పుతో మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయో, దాంతో వేటిని శుభ్రం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కొద్దిగా ఉప్పును మీ ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌దేశాల్లో చ‌ల్లండి. దీంతో చీమ‌లు రావు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే తేమ వాతావర‌ణం కూడా పొడిగా అవుతుంది. కొద్దిగా ఉప్పు, కొంత యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుని మిశ్ర‌మంగా చేయాలి. దీంతో రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరుస్తాయి. రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీట‌ర్ల గోరు వెచ్చని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని ఉప‌యోగించి కిటికీ తలుపులు, గ్లాస్ విండోస్‌, కార్ విండోస్‌ల‌ను క్లీన్ చేస్తే శుభ్రంగా మెరుస్తాయి. పైన చెప్పిన ఉప్పు, గోరు వెచ్చని నీటి మిశ్ర‌మాన్ని ఉప‌యోగించి కిచెన్ సింక్‌ను క్లీన్ చేస్తే అందులో జామ్ అయిన ప‌దార్థాల‌న్నీ పోతాయి.

Salt

కొద్దిగా ఉప్పు, ల‌వంగ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని బాగా క‌లిపి శ‌రీరానికి రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక స్నానం చేయాలి. దీంతో చ‌ర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శ‌రీరం కాంతివంతంగా మారుతుంది. కొంత నీటిలో ఉప్పును వేసి బాగా క‌లిపి ఆ నీటిలో ఒక గుడ్డ ముక్క‌ను ముంచి దాంతో కార్పెట్లు, దుప్ప‌ట్లు, దుస్తులపై ప‌డ్డ మ‌ర‌కల‌ను తుడ‌వాలి. దీంతో ఆ మర‌క‌లు ఇట్టే తొల‌గిపోతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని 1 నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.

బేకింగ్ సోడా, ఉప్పును స‌మాన భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని కొంత నీటికి కలిపి పేస్ట్‌లా చేసి దాంతో ప‌ళ్లు తోముకుంటే ప‌ళ్లు మిల‌మిలా మెరుస్తాయి. దుస్తుల‌ను డిట‌ర్జెంట్ లేదా స‌బ్బుతో ఉతికిన త‌రువాత నీటిలో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటిలో దుస్తుల‌ను ముంచి తీయాలి. దీంతో దుస్తులు ష్రింక్ అవ‌వు. దీనికి తోడు బ‌ట్ట‌లు శుభ్రంగా, మృదువుగా మారుతాయి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM