దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మరో 2 నెలల్లో దేశంలో 44 కోట్ల డోసులు సిద్ధం చేస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పింది. ఈ నెల 21వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలను ఉచితంగా అందిస్తామని కూడా కేంద్రం వెల్లడించింది. అయితే టీకాలను తీసుకోవడంలో చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. వాటిల్లో సహజంగానే చాలా మందికి వస్తున్న సందేహం.. కోవిడ్ టీకా తీసుకుంటానికి ముందు, తరువాత మద్యం సేవించవచ్చా ? అని.. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే..
కోవిడ్ వ్యాక్సిన్‌కు ముందు లేదా తరువాత ఎప్పుడైనా సరే ఆల్కహాల్‌ను సేవిస్తే దాని ప్రభావం టీకాపై ఉండదు. ఆల్కహాల్ ప్రభావం యాంటీ బాడీల ఉత్పత్తిపై పడదు. కనుక ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతోపాటు అమెరికాకు చెందిన సీడీసీ కూడా వెల్లడించింది. వ్యాక్సిన్లపై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపించదని తేల్చారు.
ఇక కోవిడ్ టీకాలపై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని తయారీ సంస్థలే వెల్లడించలేదు. సాధారణంగా ఇంగ్లిష్ మందులను వాడేటప్పుడు ఆల్కహాల్‌ను సేవించకూడదని, లేదంటే రియాక్షన్లు వస్తాయని చెబుతారు. కానీ కోవిడ్ టీకాల విషయంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కూడా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు యూకేకు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) కూడా కోవిడ్ టీకాలపై ఆల్కహాల్ ప్రభావం చూపించదనే చెప్పింది. కనుక ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు సూచిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…