ప్రస్తుతం టాలీవుడ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియన్ స్థాయిలో ఏ విధమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం విశేషం. ఈ క్రమంలోనే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా జిల్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “రాధేశ్యామ్” చిత్రం గురించి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా ప్రభావంతో వాయిదా పడింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలోవైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదల విషయానికి వస్తే ఇప్పట్లో థియేటర్లో తెరుసుకునే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులకోసం 400 కోట్ల డీల్ నిర్మాతల ముందు పెట్టినట్టు తెలుస్తోంది.
గతంలో ఈ సినిమా కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి ఈక్రమంలోనే నెట్ఫ్లిక్స్ ఏకంగా 300 కోట్లు ఆఫర్ చేయగా… ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ 400 కోట్ల ఆఫర్ ప్రకటించింది. ఈ విధమైనటువంటి భారీ ఆఫర్ ప్రకటించడంతో నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా? లేక థియేటర్లలో విడుదల చేస్తారనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…