ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. కొందరు దుండగులు కావాలని పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫేక్ వార్త బాగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..
రూ.12,500 చెల్లిస్తే 30 నిమిషాల్లోగా రూ.4.62 కోట్లు వస్తాయని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ స్కీమ్‌ను అందిస్తుందని ఓ మెసేజ్ వైరల్ అయింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని, తాము అలాంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టలేదని ఆర్‌బీఐ తెలియజేసింది.
https://twitter.com/PIBFactCheck/status/1434830688042225664
అలాగే ఫ్యాక్ట్ చెక్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ మెసేజ్‌లో నిజం లేదని, ఆర్బీఐ ఎలాంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టలేదని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. అందువల్ల ఈ మెసేజ్ వచ్చిన వారు స్పందించకూడదని, లేదంటే నష్టపోతారని తెలియజేసింది. ఏమైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే 155260 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఆర్‌బీఐ తెలియజేసింది.