వినోదం

Vyooham Web Series OTT Release Date : ఓటీటీలోకి వ్యూహం వెబ్ సిరీస్.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

Vyooham Web Series OTT Release Date : ఇప్పుడు ఓటీటీల హ‌వా న‌డుస్తుంది. అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో తెగ సంద‌డి చేస్తున్నాయి. ఒక‌ప్పుడు హిందీలో మాత్రమే రూపొందే వెబ్ సిరీస్‌లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం తెరకెక్కుతూ ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతున్నాయి. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్‌ల‌లో నటించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. రీసెంట్ గా వ‌చ్చిన కుమారి శ్రీమతి, మోడర్న్ లవ్ హైదరాబాద్, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్‌, రెక్కీ, లేటెస్ట్‌గా దూత వెబ్‌ సిరీస్‌లు తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కోవలోనే వ్యూహం వెబ్ సిరీస్ ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన వ్యూహం ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్ గా రూపొందగా, ఈ వెబ్ సిరీస్‌లో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ సిద్దంశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వ్యూహం సిరీస్‌ డిసెంబర్‌ 14న అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. నాగచైతన్య నటించిన దూత వెబ్‌ సిరీస్‌ ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు వ్యూహం వెబ్ సిరీస్ కూడా అదే రేంజ్‌లో స‌క్సెస్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు.

Vyooham Web Series OTT Release Date

వ్యూహం ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ కాగా, ఇందులో న్యాయం కోసం అతడు చేసే పోరాటం, ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు, అతని వేటాడే గతం వ్యూహం సిరీస్ ను ఇంట్రెస్టింగా మార్చనుంది. మ‌రి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని ఇష్ట‌ప‌డే వాళ్లు ఈ వ్యూహం సిరీస్ చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయవ‌చ్చు. ఇక ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వ‌ర్మ వ్యూహం పేరుతో ఓ సినిమా చేయ‌గా, ఈ సినిమా ఇప్ప‌టి వ‌రకు రిలీజ్‌కి నోచుకోలేదు. చూస్తుంటే దానిని ఆయ‌న సైలెంట్‌గా ఓటీటీలోకి విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM