Vijay Deverakonda : టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జంటలలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట ఒకటి. విజయ్ దేరవకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తునే ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమించుకోగా, కొద్ది రోజులకి వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇంతలో ఏం అయిందో తెలియదు.. వీళ్ల పెళ్లి బ్రేక్ అయింది. అయితే అప్పుడే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. ఈ సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ చాలా క్లోజ్ అయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలని భావించారని ప్రచారం నడిచింది.
రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని వారు వెకేషన్స్‌కి కూడా కలిసే వెళుతున్నట్టు ప్రచారం నడుస్తుంది. వీరు వేరు వేరుగా ఫోటోలు దిగిన… ఒకే లోకేషన్ లో దిగుతున్నారు. దీనితో ఇది చూసిన నెటిజన్స్… వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ.. ఫ్రూవ్స్ సహా ఫోటోలను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నరు. ఈ ఇద్దరి ఏముందో ఏమో తెలియదు కాని తాజాగా విజయ్ దేవరకొండ.. రష్మికకి ఫుల్ సపోర్ట్ అందించారు. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో దీనిపై పలువువరు ఆగ్రహం వ్యక్తం చేసారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలోనే రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది అని చెప్పిన విజయ్… ఇలాంటి నిర్ణయమే ఇప్పుడు తీసుకోవాలి.. మరోసారి ఇంకొకరికి ఇలాంటి ఘటన జరగకూడదు అని భావిస్తున్నాను.. డీప్‌ఫేక్ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, వారిని వెంటనే శిక్షించాలని విజయ్ దేవరకొండ డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే మహిళలు రక్షించబడతారు అని విజయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…