Venky 75 OTT Streaming : విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. అలానే మల్టీ స్టారర్ చిత్రాలతో అలరిస్తున్నాడు. వెంకీ ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు చేస్తూనే మరోవైపు రానా నాయుడు లాంటి బోల్డ్ కంటెంట్ నేపథ్యం ఉన్న వెబ్ సిరీస్ చేసారు. ఓ వెబ్ సిరీస్ చేశారు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమాను చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 22న వస్తున్నట్లు ప్రకటించారు. అదే డేట్‌కు సలార్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సైంధవ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టీమ్ తాజాగా ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 13న భారీగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే రీసెంటగా వెంకీ 75 అనే కార్యక్రమాన్ని నిర్వహించింది సైంథవ్ మూవీ నిర్మాతల బృందం. వెంకీ 75 సినిమాల ప్రయాణాన్ని తెలిపే విధంగా కలియుగ పాండవులు నుంచి సైంధవ్ వరకు తన సినీ ప్రయాణాన్ని తెలుపుతూ ఓ షో నిర్వహించారు.ఈ ఈవెంట్ కి చిరంజీవి , రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు.
వెంకీ 75 ఈవెంట్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ యాప్ ఈ విన్ కొనుక్కోవడంతో ఈవెంట్ ని బయట టెలికాస్ట్ చేయలేదు. అయితే ఈ ఈవెంట్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ ఈవెంట్లో కామెడీ స్కిట్స్, డ్యాన్సులు, పాటలు, ఎమోషనల్ స్పీచ్ లు, గేమ్స్.. ఇలా అన్ని కలగలిపి ఉన్నాయి. ప్రస్తుతం వెంకీ 75 ఈవెంట్ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.‘వెంకీ 75 కలియుగ పాండవులు – సైంధవ్’ పేరిట డిసెంబర్ 27న భారీగా జరిగిన ఈ ఈవెంట్ నేటి సాయంత్రం ఆరు గంటలకు ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానుంది. “వెంకీ మామ మాస్ జాతర అంటున్నా. ఈవెంట్ అదిరిపోద్ది అంటున్నా.. ఇచ్చి పడేస్తున్నాం అంటున్నా. ఐకానిక్ ల్యాండ్‍మార్క్ ఈవెంట్ వెంకీ 75 డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ అవుతుంది” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…