Guppedantha Manasu January 1st Episode : వసుధారని కిడ్నాప్ చేయడానికి, సరైన టైమ్ కోసం భద్ర ఎదురు చూస్తాడు. కాలేజీలో వసుధారను సీక్రెట్ గా ఫాలో అవుతాడు. కానీ, వసుధారకి దొరికి పోతాడు. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావని, భద్ర ని నిలదీస్తుంది. నీ వెనకే ఉంటే మిమ్మల్ని కాపాడమని మహేంద్ర సర్ చెప్పారు. అందుకే అని చెప్తాడు. కానీ, వసుధార నమ్మదు. ఇది కాలేజీ. ఇక్కడ నన్ను కిడ్నాప్ చేయడానికి, ఎవరైనా ట్రై చేస్తే, స్టూడెంట్స్ తుక్కురేకొడతారని, వార్నింగ్ ఇస్తుంది. తనని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది. వసుధారని ఫాలో కాకుండా, కాలేజీలో ఖాళీగా తిరుగుతున్న భద్రని చూసి, శైలేంద్ర మండిపడతాడు.
వసుధార ని ఫాలో అవుతూ, తను ప్రతి కదలికను తెలుసుకోమని చెప్పాను కదా అని కోప్పడతాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావని, భద్ర మీద ఎగిరి పడతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా, అప్పుడే అక్కడికి మహేంద్ర వస్తాడు. అతన్ని చూసి, శైలేంద్ర షాక్ అవుతాడు. దొరికిపోయామని కంగారు పడతాడు. కానీ, మహేంద్ర వారి మాటలు వినడు. శైలేంద్ర బెదిరిస్తున్నాడని, అపోహపడి, మహేంద్ర ని నీకు ఎండి సీట్ మీద ఆశ లేదని అన్నావు కదా..? మరి ఎందుకు వచ్చావు అని అంటాడు. లెటర్ రాసి ఇచ్చిన విషయం వసుధార అందరికీ చెప్పిందని, శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. వసుధారతో మాట్లాడాలని రిషి పడుతున్న తపన చూసి, పెద్దయ్య కరిగిపోతాడు. ఒక కుర్రాడు దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకొస్తాడు.
పెద్దయ్య ఇచ్చిన ఫోన్ తో వసుధార తో మాట్లాడటానికి రిషి ట్రై చేస్తాడు. కాలేజీ పనుల్లో బిజీగా ఉన్న వసుధార కొత్త నెంబర్ రావడం వలన లిఫ్ట్ చేయదు. కాల్ కట్ చేయలేదని రిషి బాధ పడతాడు. తిరిగి రివర్స్ కాల్ చేస్తుంటే, రిషి లిఫ్ట్ చేసి వసుధారా అని పిలుస్తాడు. రిషి గొంతు విని వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషితో వసుధార మాట్లాడుతున్నప్పుడు శైలేంద్ర చాటుగా వింటాడు. ఆ విషయం వసుధార కనిపెడుతుంది రిషితో తను మాట్లాడుతున్న విషయం శైలేంద్ర కి తెలియకుండా ఉండడానికి మాట మారుస్తుంది.
మా కాలేజీకి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదని, ఫోన్ కట్ చేస్తుంది. రిషి షాక్ అవుతాడు. రిషితోనే వసుధార ఫోన్ మాట్లాడిందని శైలేంద్ర కనిపెడతాడు. ఆమె నోట నుండి ఆ విషయాన్ని చెప్పించాలని, ప్లాన్ చేస్తాడు. క్యాబిన్ నుండి వెళ్ళిపోమని వసుధార వార్నింగ్ ఇస్తుంది. వసుధార మాటలతో రిషి షాక్ అవుతాడు. పదేపదే ఫోన్ చేసి విసిగించొద్దు అని వసుధార తనతో ఎందుకు ఆందో అర్థం కాదు. వసుధార నిన్ను గుర్తుపట్టి ఉండదని, అంటాడు. గుర్తుపట్టిందని సార్ అని పిలిచిందని అంటాడు.
తనకు ఏదైనా సమస్య వచ్చి ఉంటుంది. అందుకే నిన్ను గుర్తుపట్టిన పట్టలేనట్లుగా మాట్లాడి ఉంటుందని చెప్తాడు పెద్దయ్య. వసుధార ప్రమాదంలో వున్నా కాపాడలేకపోతున్నానని, బాధపడతాడు రిషి. తిరిగి రిషికి కాల్ చేస్తుంది ఇందాక ఇబ్బంది వల్ల అలా మాట్లాడాల్సి వచ్చిందని సారీ చెప్తుంది. చావు వరకు వెళ్లొచ్చానని, నీతో మాట్లాడే ఓపిక కూడా లేదని నీరసంగా మాట్లాడుతాడు. రిషి నిలబడలేక పోతున్నానని తన పరిస్థితి దారుణంగా ఉందని వసుధార కి చెప్తాడు. మీకేం కాదు. నేను వచ్చి తీసుకెళ్తానని చెప్తుంది. రిషి ని కాపాడిన పెద్దమ్మ పెద్దయ్య కి కృతజ్ఞతలు చెప్తుంది. రిషి ఫోన్ చేసిన విషయం ఎవరికీ చెప్పదు. ఎవరికి తెలియకుండా, రిషి దగ్గరకి రిషి చెప్పినట్లు వెళ్లాలని అనుకుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…