Varun Tej : మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించుకున్న వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠి జంట జూన్ 9న నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక నవంబర్ 1న ఈ జంట ప్రేమ వివాహం జరిగింది. అల్లు శిరీష్ నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ఆ ఫ్యామిలీ నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇటీవలూ వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల మధ్య వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా, నవంబర్ 5న టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో వీరు రిసెప్షన్ జరుపుకున్నారు. వీరి పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన ఫొటోలు, వీడియొలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
వరుణ్ తేజ్ పెళ్లై 10 రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయన సినిమా షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. లావణ్యతో హానీమూన్ కి వెళ్లకుండా ఈ యువ హీరో ప్రస్తుతం మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కు గత కొంత కాలంగా సినిమాల్లో కలిసి రావడం లేదు. చివరిసారిగా గాంఢివదారి అర్జున సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో వరుణ్ తేజ్ ఈ సినిమాలతో ఎలా అయిన హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అయితే వరుణ్ సినిమా వర్క్ విషయంలో లావణ్య త్రిపాఠి కూడా చాలా ఫేవర్‌గా ఉందని అర్ధమవుతుంది.
ఇక ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో మాత్రం తన అక్క ఉపాసనని ఫాలో అవుతున్నట్టు అర్ధమవుతుంది . రామ్ చరణ్, ఉపాసన దంపతులకి పెళ్లైన పదకొండేళ్లకి పాప జన్మించగా, లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాల పాటు పిల్లలకి దూరంగా ఉంటుందట. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలని ఈ భామ భావించడంతో పాటు ఒక ప్రొడక్షన్ హౌస్ తో స్టార్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయిందట. అలాగే ఓ బ్రాండెడ్ డిజైనర్ షోరూమ్ కూడా ఓపెన్ చేయాలి అని సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన దుస్తులను తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఓ వెబ్సైట్ ని కూడా రూపొందించాలని లావణ్య అనుకుంటుందట. వీటన్నింటిని ఓ రేంజ్‌కి తీసుకెళ్లేందుకు పదేళ్లపాటు సమయం పడుతుందని, అప్పటి వరకు తనకు పిల్లలు వద్దని డిసైడ్ అయిందట లావణ్య.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…