Guppedantha Manasu November 11th Episode : వసుధారకి రిషి చెవికమ్మలు గిఫ్ట్ గా ఇస్తాడు. అవి కిందపడిపోతాయి. రిషికి కనిపిస్తాయి. అతను వాటిని తీసి దాచిపెడతాడు. ఏమీ తెలియనట్లు కొంచెం సేపు ఆటపట్టిస్తాడు. ఎంతో ప్రేమగా తీసుకొచ్చా కదా, ఎందుకిలా అయిందని రిషి అంటాడు. కచ్చితంగా దొరుకుతాయని ఆమె అంటుంది. ఎప్పటికీ దొరకవు, దీంతో వసుధార.. పోనీలెండి వాటిని పెట్టుకునే అదృష్టం నాకు లేదు, అవి అందుకే దొరకడం లేదు అని అంటుంది. దీంతో రిషి ఆ రింగులని చూపిస్తాడు. దీంతో ఆమె సంతోషపడుతుంది. అంటే మీ దగ్గర దాచేసి నన్ను ఆటపట్టించారు కదా మీరు, దొంగ సార్ అంటుంది. నన్ను ఏడిపించారు కదా అంటుంది. ఇది ఏడిపించడం కాదు, నా చిలిపి జ్ఞాపకం అని అంటాడు రిషి. ఇప్పటివరకూ మనకున్న దూరం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ మనం రిషిధారలం అయ్యాం అని అంటాడు. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ రిషి తాను తెచ్చిన రింగులను వసు చెవులకి పెడతాడు. అలా ఇద్దరూ కాసేపు సంతోషంగా గడుపుతూ సెల్ఫీ తీసుకుంటారు.
అనుపమ విశ్వనాథం దగ్గరికి వెళ్తుంది. నీకు ఇక్కడ అంతా ఓకేనా అమ్మ అనడంతో బాగానే ఉంది డాడ్ అని అంటుంది. డాడీ నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చా. నేను ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నా.. అనడంతో ఏం ఫంక్షన్ అని అడుగుతాడు విశ్వనాథం. మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలుస్తాననడంతో సరే అని ఓకే చెబుతాడు విశ్వనాథం. ఫ్రెండ్స్ ని కలవడం చాలా మంచిది వాళ్ళని కలవడం వల్ల పాత జ్ఞాపకాలు వచ్చి మనస్సు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుందని అంటాడు. కొంతమంది నంబర్స్ ఉన్నాయి మరి కొంతమంది నంబర్స్ లేవు, అదదర్నీ కలవాలి, నా హెల్ప్ కావాలంటే నేను చేస్తానంటాడు విశ్వనాథం.
రిషి వసుధార ఒడిలో తల పెట్టుకుని పడుకుని కబుర్లు చెబుతూ ఉంటాడు. నేను ఒకటి అడుగుతాను చెప్పు వసుధార, నేను ఏంజెల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసు కదా అనడంతో, అవును సార్ అని అంటుంది. మా ఇద్దరి మీద ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అని అడగడంతో ముందు పైకి లేవండి సార్ అని అలిగి పక్కకు వెళ్లి నిలబడుతుంది వసుధార. ఏమైంది అలా వెళ్ళిపోయావు అనడంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ మాట వేరే వాళ్ళు కనుక అడిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని బుంగమూతి పెడుతుంది వసుధార. మీ మీద నాకు ప్రేమ తప్ప మరో ఆలోచన లేదు మిమ్మల్ని అనుమానిస్తే ఈ వసుధార అసలు వసుధారే కాదనడంతో రిషి సంతోషిస్తాడు. అయినా వసు బుంగమూతి పెట్టడంతో బెడ్ పైకి ఎక్కి, వసుధారా సారీ అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు మావయ్య వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయనంటుంది వసుధార. అయితే టెర్రస్ పైకి ఎక్కి గట్టిగా అరిచి చెబుతానంటాడు. వద్దులెండి మీ సారీ యాక్సెప్ట్ చేస్తాననడంతో రిషి చాలా హ్యాపీగా ఫీలవుతాడు.
మరొకవైపు ఫణీంద్ర పేపర్ చదువుతుండగా ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. నేను లేనప్పుడు వచ్చి డాడ్ ని కలిసి వెళ్లారంట అంటాడు రిషి. నా మనసంతా ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. నేను మీ డాడీ మీ ఇంటికి రమ్మని పిలిచాను. ఎన్ని సార్లు అడిగినా రాను అన్నాడు. అందుకే నేను బలవంతం చేయలేదు, పెద్దనాన్న మీరు ఏమీ అనుకోకపోతే అప్పుడప్పుడు వచ్చి డాడ్ ని పలకరించి వెళ్తారా అనడంతో తప్పకుండా రిషి, నా తమ్ముడిని బాగు చేసుకోవడం నా బాధ్యత అని అంటాడు. ఇంతలో దేవయాని, శైలేంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు శైలేంద్ర ఫోన్ తీసుకొని రిషితో ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తాడు. అప్పుడు శైలేంద్ర అసలు విషయం రాబట్టడం కోసం మొన్న మేము వచ్చినప్పుడు మీరు లేరు ఎక్కడికి వెళ్లారు రిషి అని అడుగుతాడు. అప్పుడే వచ్చిన వసుధార, మిమ్మల్ని మావయ్య పిలుస్తున్నారని చెప్పి ఫోన్ తీసుకుని రిషిని పంపించేస్తుంది.
వసుధార అంటూ.. రిషి సార్ ని ఏమడుగుతున్నారు, శైలేంద్ర ఏమీ లేదంటాడు, మీ బుద్ధులన్ని నాకు తెలుసు సార్ ప్రేమగా నటిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు మొన్న వచ్చినందుకు సంతోషం ఎందుకంటే పెద్ద మామయ్య వాళ్ళు చిన్న మామయ్య సంతోషంగా ఉంటారు కానీ మీరు రావడం వల్ల మాకు సంతోషం దూరం అవుతుంది అని వసుధార అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ధరణి మేడంని కూడా మీతో పాటూ తీసుకొస్తే బాగుండేది, ధరణి మేడం భూషణ్ ఫ్యామిలీ మెంబర్ అని అనుకోవడం లేదా, స్త్రీని గౌరవించడం తెలియని మీరు ఓ కాలేజీని ఎలా నడపగలరు శైలేంద్ర గారు, జీవితంలో మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముందు అవి నేర్చుకోండి, అంతే కానీ కాలేజీ జోలికి రావొద్దు అంటుంది.
మా గురించి మర్చిపోయి మాట్లాడుతున్నావా అని దేవయాని అంటుంది. అందుకు వసు అరవకండి మేడం, ఆరోగ్యానికి మంచిది కాదు అంటుంది. అప్పుడు దేవయాని శైలేంద్రతో పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దు అంటుంది. భార్య-భర్త బాగుంటే ఎవ్వరూ జోక్యం చేసుకోరు, కానీ నా తోడి కోడలు బాధపడితే చూస్తూ ఊరుకోలేను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వసు అంటుంది. దేవయాని-శైలేంద్ర షాకవుతారు. ఎపిసోడ్ ముగుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…