Varaha Roopam Video Song : కాంతారా సినిమా నుండి, వరాహ రూపం పూర్తి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పూర్తయింది. ఇప్పుడు, ఈ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. గత ఏడాది వచ్చిన కాంతారా సినిమా పెద్ద హిట్ అయింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ తో పాటుగా దేశవ్యాప్తంగా కూడా మంచి హిట్ ని అందుకుంది. రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా కాంతారా సినిమాకి దర్శకత్వం వహించారు.
కన్నడ సంప్రదాయాలను చూపించారు. యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తీసుకురాగా, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. భారీ కలెక్షన్ ని కూడా కాంతారా మూవీ దక్కించుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 30న కన్నడలో, కాంతారా ని రిలీజ్ చేశారు. ఈ సినిమా వచ్చి ఏడాది అయింది. అయితే, ఈ సందర్భంగా వీడియో సాంగ్ రిలీజ్ చేసింది హోమ్బాలే ఫిలిమ్స్. ఈ మూవీలో వరహరూపం పాట పూర్తి వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఈ పాట కన్నడ భాషలో ఉంది. ఇతర భాషల్లో మూవీని రిలీజ్ చేసినా, సాంగ్ మాత్రం ఆ వెర్షన్ లోనే ఉంచేసారు. ఈ పాట అందరినీ బాగా అలరించింది. ఈ సాంగ్ లో రిషబ్ శెట్టి ఆడిన, భూత కోలం నృత్యం కూడా అందర్నీ ఆకట్టుకుంది. కాంతారా సినిమాలో ఈ సాంగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది.
ఈ సినిమాకి అజనీశ్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. వరాహ రూపం పాటని సాయి విగ్నేష్ పాడారు. శశిరాజ్ కావూరు లిరిక్స్ ని అందించారు. అయితే, సినిమా లో ఉన్న ఈ సాంగ్ ఫుల్ వీడియో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా, ఇప్పుడు ఈ పాట యూట్యూబ్లో అందుబాటులో ఉంది.