Vaazhai OTT Release : ఇటీవలి కాలంలో చాలా మంది దర్శకులు డైరెక్ట్‌గా ఓటీటీలోకి తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరు తప్పని పరిస్థితులలో విడుదల చేస్తుండగా, మరి కొందరు కావాలనే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. కలైయరసన్ మరియు నిఖిలా విమల్ నటించిన వాజై తమిళ డ్రామా చిత్రం కాగా, మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు . మారి తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్,తో పాటు పెరియారుమ్ పెరుమాల్ సినిమాలు కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఆయన ప్రతి చిత్రంలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలను కమర్షియల్ పంథాలో చూపిస్తూ పలు అవార్డ్‌లు కూడా అందుకున్నారు.
ఆయన తాజాగా వాజై అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీ థియేటర్‌లో విడుదల అవుతుందని అందరు భావించారు. కాని ఊహించని విధంగా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. వాజై మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. వీలైనంత త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించారు. మూడు బ్లాక్‌బస్టర్స్ తర్వాత మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న వాజై మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాజై సినిమాను నిర్మించిన క్రమంలోనే ఈ మూవీని థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారని సమాచారం.
ఇక వాజై సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తూత్తుకుడిలో జరిగింది. ఈ చిత్రం కూడా సోషల్ మెసేజ్‌తో ఉంటుందని తెలుస్తుండగా, ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి థ్రిల్ అందించే విధంగా ఉంటుందని ప్రేక్షకులు ఈ మూవీని తప్పక ఇష్టపతారని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…