Urfi Javed : ఉర్ఫీ జావెద్ గురించి సినీ ప్రియులకి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో విచిత్రమైన దుస్తులతో హల్చల్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆమెని ఎవరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసిన కూడా ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గదు. ఆ మధ్య ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఎప్పుడూ చూడని విధంగా ఉర్ఫీ జావేద్ సల్వార్ సూట్ వేసుకుని గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు. సల్వార్ కమీజ్‌లో ఉర్ఫీని చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ దుస్తులని ఎంచుకుంటూ వింత ఫ్యాషన్ పిచ్చితో ధైర్యంగా పబ్లిక్‌లో కనిపిస్తారు. దీంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలు ఎదుర్కుంటూ ఉంటారు.
పలుమార్లు పబ్లిక్ ప్లేసెస్ లో ఆమె న్యూసెన్స్ చేయగా, ఆమెని కొందరు తిట్టిపోసారు కూడా. అయిన ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు.. ఆమె వస్త్రధారణ చూసి పలు రెస్టారెంట్లు లోపలికి అనుమతించకపోవడం వివాదం అయ్యింది. రెస్టారెంట్ యజమానులతో ఉర్ఫీ గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బోల్డ్ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఉర్ఫీ అకౌంట్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె పోస్టు చేసే వీడియోలు, ఫోటోలు గైడ్ లైన్స్ విరుద్ధంగా ఉన్న కారణంగానే ఆమె అకౌంట్ ను తొలగించారు. పలువురు నెటిజన్లు కూడా ఆమెకు సంబంధించి పోస్టుల విషయంలో పెద్ద సంఖ్యలో రిపోర్టులు కొట్టడంతో ఇన్‌స్టా యాజమాన్యం ఆమె అకౌంట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.

ఇన్ స్టా నుంచి ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సదరు సంస్థ నుంచి మెసేజ్ రాగా, ఆ మెసేజ్‌ని ఉర్ఫీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే మంచి పని అయిందని అందరు అనుకుంటున్న సమయంలో ఉర్ఫీ అకౌంట్ ను పునరుద్దరించింది. ఇదే విషయంపై ఇన్ స్టా టీమ్ రియాక్ట్ అయ్యింది. పొరపాటున ఉర్ఫీ అకౌంట్ మిస్ అయిందని, మళ్లీ తిరిగి యాక్టివేట్ చేసామని పేర్కొంది. తన అకౌంట్ తిరిగి రావడంతో ఉర్ఫీ తెగ సంతోషం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయిన ఉర్ఫీ ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి క్రేజ్ దక్కించుకుంది.