Tripti Dimri : ఇప్పుడు ఎక్కడ చూసిన యానిమల్ మూవీ గురించే చర్చ నడుస్తుంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. చిత్రంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మధ్య లిప్ కిస్ సీన్స్, బెడ్ రూం సీన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా యూత్ ఈ సినిమాలోని సన్నివేశాలకి తెగ కనెక్ట్ అయ్యారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా కొందరిని ఆకట్టుకున్నాయి. అయితే ఇందులో రష్మిక కన్నా కూడా ఓ నటి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు తృప్తి డిమ్రి.
ఒక్క మంచి సక్సెస్ పడితే వారి క్రేజ్ అమాంతం పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాఖండ్ బ్యూటీ తృప్తి డిమ్రీ ఇటీవలే రణ్‌బీర్‌కపూర్ టైటిల్ రోల్‌లో నటించిన యానిమల్ చిత్రంలో జోయా పాత్రలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసింది. ఈ అమ్మడి ఆరబోత చూసి అందరు కూడా ఎవరు ఈమె అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆమె క్రేజ్ కూడా పెరిగింది. యానిమల్ చిత్రానికి ముందు తృప్తి డిమ్రి ఫాలోవర్ల సంఖ్య 60K కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం యానిమల్ రిలీజయ్యాక కేవలం మూడు రోజుల్లోనే రెట్టింపు 1.2 మిలియన్‌కు చేరుకుంది. అంటే యానిమల్ సినిమా ఈ అమ్మడికి ఎంత క్రేజ్ పెంచిందో అర్ధమవుతుంది.

యానిమల్ విడుదలైనప్పటి నుంచి తృప్తి పేరు ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోవడంతో ఈ భామకి హిందీలోనే కాదు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. మరి సౌత్‌లో తొలిసారి ఏ హీరో సరసన ఈ అమ్మడు నటిస్తుందో చూడాల్సి ఉంది. ఈ భామ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోండగా.. వీటిలో ఒకటి చిత్రీకరణ దశలో ఉంది. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక యానిమల్ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్ల వరకూ వసూలు చేసింది.యానిమల్ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.