Ram Charan : దీపావళి పండగని ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పండగని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా సంతోషంగా జరుపుకున్నారు. బాణాసంచాలు కాలుస్తూ కొందరు, మరి కొందరు పార్టీలతో పాటు సంతోషంగా జరుపుకున్నారు. ఇక రామ్ చరణ్- ఉపాసన టాలీవుడ్ ప్రముఖుల అందరికి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు. దీపావళి వేడుకలను పురష్కరించుకుని రామ్ చరణ్ ఉపాసన దంపతులు పలువురు ప్రముఖులని తమ ఇంటికి ఆహ్వానించారు. అతిథులలో వెంకటేష్, మహేష్ బాబు, నమ్రత, ఎన్టీఆర్, ప్రణతీ దంపతులతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు రామ్‌చరణ్ నివాసంలో దీపావళి వేడుకలు జరిగాయి.
ఈ వేడుకల్లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. తాజాగా ఈ ఫోటోలను నమత్ర ఇన్‌స్టాలో సేర్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ స్టార్స్ జంటలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిండచంతో మెగా, ఘట్టమనేని, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇదే పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్, మంచు లక్ష్మి కూడా హాజరయ్యారు.తమకు ఆతిథ్యమిచ్చిన రామ్‍చరణ్, ఉపాసనకు థ్యాంక్స్ చెబుతూ క్యాప్షన్ పెట్టారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా ఒకే ఫ్రేములో కనిపించి సందడి చేశారు. మరోవైపు వెంకటేష్ కూడా అల్లు అర్జున్ తో కూడా కనిపించి సందడి చేశారు.

ఎన్టీఆర్, చరణ్, మహేష్ తరచుగా పార్టీలలో చిల్ కావడం చూస్తూనే ఉన్నాం. సందర్భం వచినప్పుడల్లా వీరు ముగ్గురూ ఒక్కటవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి వెంకీ మామ కూడా తోడయ్యాడు. వెంకటేష్ మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించినప్పటి నుంచి చాలా క్లోజ్ అయ్యారు. ఇటీవల వెంకటేష్ కూతురి వేడుకలో మహేష్ బాబు సందడి చేయడం చూశాం. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎప్పటి నుండో స్నేహితులు కాగా, వీరు అందరు కలిసి ఇలా పార్టీలో సందడి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.