Tillu Square Radhika Song : డీజే టిల్లు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘టికెట్టే కొనకుండా’లో అనుపమ గ్లామరస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు రెండవ గీతంలో కూడా ఆమె ఆకట్టుకుంటోంది.
సిద్ధు జొన్నలగడ్డ పాటకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.’రాధిక’ పాట ఆకర్షణీయమైన బీట్‌ను కలిగి ఉంది. రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించడం, ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించడంతో పాట మాంచి ఊపు మీదుంది. రామ్ మిరియాల సంగీతం, గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం కలిసి ఈ పాట అద్భుతంగా ఉంది. డీజే టిల్లు చూసినవారికి రాధిక క్యారెక్టర్ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు. ఈ మూవీలో హీరోయిన్ కంటే రాధిక అనే పేరే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే టిల్లు 2 లో కూడా రాధిక ఉండబోతుంది. ఎందుకంటే రాధికా పేరు మీదనే సెకండ్ సాంగ్‌ను విడుదల చేయడంతో ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

రాధికా పేరుతో వచ్చిన ఈ సాంగ్ టాప్ 10 సాంగ్స్‌లో ఒకటిగా తప్పక నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది.సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.టిల్లు స్క్వేర్ సినిమా 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అందరు భావిస్తున్నారు.