Tiger Nageswara Rao OTT : వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే హీరోలలో రవితేజ ఒకరు. ఆయన ఇటీవలి కాలంలో చేసిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులని అలరించలేదు. రవితేజ హీరోగా వంశీ అనే డైరెక్టర్ తీసిన మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులని అలరించింది. 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా ఇది తెరకెక్కింది. ఈ మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీ నష్టాలతోనే రన్‌ను ముగించి ఫ్లాప్‌గా మిగిలిపోయింది.
టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సంబంధించి తీవ్ర డిమాండ్ నడుమ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఏమాత్రం సమాచారం లేకుండానే నవంబర్ 17వ తేదీ నుంచి రవితేజ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో ఈ చిత్రం అమెజాన్ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో రవితేజ సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి వ్యూస్ కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం 24 గంటలకు తిరగకముందే టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.

టైగర్ నాగేశ్వరరావు చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా మొత్తంలో టాప్ మూవీగా ట్రెండ్ అవుతోంది. తద్వారా ఈ ఘనత అందుకున్న రవితేజ తొలి చిత్రంగా ఇది రికార్డు సాధించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్పటికే విడుదలైన జైలర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి టైగర్ నాగేశ్వరరావు మూవీ దుమ్ములేపుతోంది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగగా.. రెండో ప్లేసులో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ మూవీ ఉంది.