వినోదం

The Village Web Series Review : ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎలా ఉంది అంటే..!

The Village Web Series Review : సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘గృహం’ తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించ‌గా, ఈ వెబ్ సిరీస్ తీసిన ద‌ర్శ‌కుడు మిళింద్ రావు తీసిన వెబ్ సిరీస్ ‘ది విలేజ్. ఇది ఆర్య తొలి ఓటీటీ వెబ్ సిరీస్. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ లో దివ్య పిల్లై , ఆడుకాలం న‌రేన్ కీల‌క పాత్ర‌లు పోషించారు.అమెజాన్ ప్రైమ్‌లో త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఈ సిరీస్ రిలీజైంది. ఆర్య డెబ్యూ వెబ్‌సిరీస్ ఎలా ఉందిని చూస్తే.. చిత్ర క‌థ‌లో భాగంగా గౌతమ్ (ఆర్య), నేహా (దివ్యా పిళ్ళై) జంట తమ కుమార్తె మాయ (బాబు అజియా)తో ఊరు ప్రయాణమవుతారు. రోడ్డులో యాక్సిడెంట్ కావడంతో ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో గూగుల్ మ్యాప్ సాయంతో షార్ట్ క‌ట్ రూట్‌లోకి వెళ‌తారు.

కట్టియాల్ దగ్గరకు వెళ్ళినప్పుడు టైర్ పంక్చర్ కావ‌డంతో సాయం కోసం దగ్గరలోని ఊరికి వెళతాడు గౌతమ్. అయితే క‌ట్టియాల్ ఓల్డ్ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్ళిన వ్యక్తులు తిరిగి రాలేదు. ఏమయ్యారో కూడా తెలియదు. అందుకని, రాత్రి వేళలో కాకుండా ఉదయం వెళదామని ఊరి ప్రజలు సలహా ఇస్తే కోపంగా వస్తాడు గౌతమ్! అప్పుడు శక్తివేల్ (‘ఆడుకాలం’ నరేన్), కరు (ముత్తు కుమార్), పీటర్ (జార్జ్ మరియన్) వస్తాడు. వచ్చేసరికి గౌతమ్ భార్య, అమ్మాయితో పాటు కారు కూడా కనిపించదు.

The Village Web Series Review

అయితే కట్టియాల్ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో శాంపిల్స్ తీసుకు రమ్మని ప్రకాష్ (అర్జున్ చిదంబరం) ల్యాబ్ టెక్నీషియన్లు, వాళ్ళకు రక్షణగా ఆయుధాలతో కూడిన ఫర్హాన్ (జాన్ కొక్కెన్), హ్యాపీ (పూజా రామచంద్రన్) బృందాన్ని పంపిస్తాడు. అసలు, కట్టియాల్ ప్రాంతంలో ఏం జరుగుతోంది? గౌతమ్ భార్య, అమ్మాయి కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? వాళ్ళకు ప్రకాష్ పంపిన బృందానికి సంబంధం ఏమైనా ఉందా? అనేది వెబ్ సిరీస్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది.దర్శకుడు మిలింద్ రావుకి హారర్ థ్రిల్లర్ జోనర్ వైపు నుంచి జనాలను భయపెట్టడంలో మంచి అనుభవం ఉంది. ఈ సిరీస్ ద్వారా ఆయన మరోసారి ఆడియన్స్ ను భయపెట్టాడా అంటే భయపెట్టాడు. అయితే అది గతంలో మాదిరిగా టేకింగ్ పరంగా కాదు, వికృతమైన ఆకారాలను క్రియేట్ చేసి .. ఆ ఆకారాలను చూడటానికి భయపడే పరిస్థితిని తీసుకొచ్చాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM