The Village Web Series Review : సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘గృహం’ తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించగా, ఈ వెబ్ సిరీస్ తీసిన దర్శకుడు మిళింద్ రావు తీసిన వెబ్ సిరీస్ ‘ది విలేజ్. ఇది ఆర్య తొలి ఓటీటీ వెబ్ సిరీస్. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ లో దివ్య పిల్లై , ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు.అమెజాన్ ప్రైమ్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఈ సిరీస్ రిలీజైంది. ఆర్య డెబ్యూ వెబ్‌సిరీస్ ఎలా ఉందిని చూస్తే.. చిత్ర కథలో భాగంగా గౌతమ్ (ఆర్య), నేహా (దివ్యా పిళ్ళై) జంట తమ కుమార్తె మాయ (బాబు అజియా)తో ఊరు ప్రయాణమవుతారు. రోడ్డులో యాక్సిడెంట్ కావడంతో ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో గూగుల్ మ్యాప్ సాయంతో షార్ట్ కట్ రూట్లోకి వెళతారు.
కట్టియాల్ దగ్గరకు వెళ్ళినప్పుడు టైర్ పంక్చర్ కావడంతో సాయం కోసం దగ్గరలోని ఊరికి వెళతాడు గౌతమ్. అయితే కట్టియాల్ ఓల్డ్ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్ళిన వ్యక్తులు తిరిగి రాలేదు. ఏమయ్యారో కూడా తెలియదు. అందుకని, రాత్రి వేళలో కాకుండా ఉదయం వెళదామని ఊరి ప్రజలు సలహా ఇస్తే కోపంగా వస్తాడు గౌతమ్! అప్పుడు శక్తివేల్ (‘ఆడుకాలం’ నరేన్), కరు (ముత్తు కుమార్), పీటర్ (జార్జ్ మరియన్) వస్తాడు. వచ్చేసరికి గౌతమ్ భార్య, అమ్మాయితో పాటు కారు కూడా కనిపించదు.

అయితే కట్టియాల్ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో శాంపిల్స్ తీసుకు రమ్మని ప్రకాష్ (అర్జున్ చిదంబరం) ల్యాబ్ టెక్నీషియన్లు, వాళ్ళకు రక్షణగా ఆయుధాలతో కూడిన ఫర్హాన్ (జాన్ కొక్కెన్), హ్యాపీ (పూజా రామచంద్రన్) బృందాన్ని పంపిస్తాడు. అసలు, కట్టియాల్ ప్రాంతంలో ఏం జరుగుతోంది? గౌతమ్ భార్య, అమ్మాయి కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? వాళ్ళకు ప్రకాష్ పంపిన బృందానికి సంబంధం ఏమైనా ఉందా? అనేది వెబ్ సిరీస్ చూస్తే అర్ధమవుతుంది.దర్శకుడు మిలింద్ రావుకి హారర్ థ్రిల్లర్ జోనర్ వైపు నుంచి జనాలను భయపెట్టడంలో మంచి అనుభవం ఉంది. ఈ సిరీస్ ద్వారా ఆయన మరోసారి ఆడియన్స్ ను భయపెట్టాడా అంటే భయపెట్టాడు. అయితే అది గతంలో మాదిరిగా టేకింగ్ పరంగా కాదు, వికృతమైన ఆకారాలను క్రియేట్ చేసి .. ఆ ఆకారాలను చూడటానికి భయపడే పరిస్థితిని తీసుకొచ్చాడు.