Hunt Movie : మహేష్ బావగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు అనుకున్నంత రాణించలేకపోతున్నాడు. ప్రతి సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబుకి ఫ్లాపులు పలకరిస్తున్నాయి. సుధీర్ బాబు నటించిన హంట్ మూవీ గత గురువారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. హంట్ మూవీ ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఇంత తొందరగా ఈ చిత్రం ఓటీటీలోకి తీసుకొస్తుండడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ హంట్‌లో సుధీర్ తోపాటు శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ నటించారు. పాత్రల పరంగా వైవిధ్యతకు ప్రాధాన్యమిచ్చే సుధీర్ బాబు మరోసారి కొత్తదనాన్ని నమ్మి ఈ సినిమా చేశారు. ఇలాంటి రోల్ చేయాలంటే కాస్తంత ధైర్యం కావాల్సిందే. పోలీస్ ఆఫీసర్ రోల్‌కు అతడి లుక్, ఫిజిక్ చక్కగా కుదిరాయి. పోలీస్ కమీషనర్‌గా శ్రీకాంత్ నటన ఎంతో బాగుంది. మరో ఇంపార్టెంట్ రోల్‌లో ప్రేమిస్తే భరత్ కనిపించాడు. ఈ ముగ్గురి చుట్టే కథ ఎక్కువగా నడుస్తుంది. క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్‌లో కొత్త కోణాన్ని టచ్ చేస్తూ రూపొందిన సినిమాగా దీనిని చిత్రీకరించారు.
మలయాళ సినిమా ముంబై పోలీస్ ఆధారంగా హంట్ సినిమాను తెరకెక్కించారు. గతాన్ని మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. తాను సాల్వ్ చేసిన ఓ కేసును గతాన్ని మర్చిపోవడం వలన తిరిగి ఫస్ట్ నుంచి ఎలా టేకాఫ్ చేశాడనే పాయింట్‌తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు మహేష్ ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు.. సింపుల్ పాయింట్‌ను డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసిన ప్రేక్షకులని ఎంతో అలరించలేకపోయింది.. సినిమా మొత్తం అర్జున్ ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంశాలు బాగున్నా వాటిలో వేగం పెరిగితే బాగుండేదని కొందరు చెప్పుకొచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…