Goddess Lakshmi : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం కోసం అనేక మంది నానా తంటాలు పడుతున్నారు. అయితే కొందరు ఎంత కష్ట పడినా డబ్బు సంపాదించలేకపోతుంటారు. ఇంకొందరు డబ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవడం లేదని వృథాగా ఖర్చు అవుతుందని విచారిస్తుంటారు. అయితే వారందరూ కింద చెప్పిన విధంగా ఓ మంత్రాన్ని రోజూ పఠించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా సరే పోతాయి. సంపద కలుగుతుంది. ధనం చేతిలో నిలబడుతుంది. ఇక ఆ మంత్రం ఏమిటంటే..
ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై, అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ, ప్రచురం ధనం మే దేహి దేహి, క్లీం హ్రీం శ్రీం ఓం.
పైన తెలిపిన మంత్రాన్ని 27 రోజుల పాటు రోజూ పఠించాలి. అయితే మొదటి రోజు 1008 సార్లు చదవాలి. రెండో రోజు నుంచి రోజుకు 108 సార్ల చొప్పున ఈ మంత్రాన్ని పఠించాలి. ఇక ఏకాసనంలో ఈ మంత్రాన్ని పఠిస్తూ జపం చేయాలి. ఇలా 27 రోజుల పాటు చేస్తే గుణం చూపిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మంత్రాన్ని ఎవరైనా సరే అత్యంత నిష్టతో, నమ్మకంతో పఠించాలి. నమ్మకం లేకుండా ఎలాంటి పూజ చేసినా.. మంత్రం పఠించినా వృథా. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. అప్పుడు ధన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సంపద బాగా కలసి వస్తుంది. దారిద్ర్యం పోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…