Categories: వినోదం

Bigg Boss: హ‌మీదాను చాలా మిస్ అవుతున్నా అని చెప్పిన శ్రీరామ్

Bigg Boss: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌రో మూడు రోజుల‌లో ముగియ‌నుంది. చివరి వారం కావ‌డంతో బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీలు చూపిస్తూ వ‌స్తున్నాడు. ష‌ణ్ముఖ్‌, మాన‌స్, శ్రీరామ్, స‌న్నీల వీడియోలు ఇప్ప‌టికే చూపించిన బిగ్ బాస్ తాజాగా ఎపిసోడ్‌లో సిరి వీడియోను ప్లే చేశాడు.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు ఏం చేయాలో పాలు పోక దాగుడుమూతలు ఆడుకున్నారు. కాసేపు ఆడుకున్న తర్వాత మానస్‌ సన్నీ ముచ్చట్లు పెట్టుకున్నారు. మానస్‌ మాట్లాడుతూ.. శ్రీరామ్‌ ఆట తనకు నచ్చదని చెప్పాడు. అన్నీ ఆలోచించి ఆడతాడని అభిప్రాయపడ్డాడు. అనంతరం సిరికి తన జర్నీ చూసే అవకాశం లభించింది.

‘అల్లరి పిల్లగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సిరిగా మీరు అందరికీ పరిచయం. కానీ ఎంతో ధైర్యంగా ఉండే సిరిలో జరుగుతున్న సంఘర్షణ వల్ల మీరు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎంచుకునేలా చేశాయి. మీ కన్నీళ్లు మౌనంగా ఆ విషయాన్ని చెప్పాయి. కానీ మీ నవ్వు చేసిన సందడిలో కన్నీళ్లు ఇంకిపోయాయి. పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట మీ విషయంలో నిజమైంది.

ఈ బిగ్‌బాస్‌ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు’ అంటూ బిగ్‌బాస్‌ ఆమెను ఆకాశానికెత్తారు. తర్వాత ఆమె జర్నీ వీడియో చూపించడంతో సిరి ఎమోషనల్‌ అయింది. మరీ ముఖ్యంగా చోటు కనిపించగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత సిరి దొరికిందే ఛాన్స్‌ అని ఐదారు ఫొటోలు తీసుకొచ్చేసింది. షణ్నుతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చింది కానీ సర్‌ప్రైజ్‌ ఇద్దామని దాన్ని డైనింగ్‌ టేబుల్‌పై దాచిపెట్టింది.

ఇంతలో అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా మాయం చేయడంతో సిరి నిరాశపడింది. జర్నీ వీడియోలో మనిద్దరం కంటెంట్‌ ఇవ్వడానికే వచ్చాం అని మానస్‌ అన్నాడంటూ షణ్నుకు చెప్పింది సిరి. దీంతో ఆగ్రహించిన షణ్ను.. ఇందుకే వాళ్ల సాయం తీసుకోవద్దంటాను అని హితవు పలికాడు.

అనంతరం బిగ్‌బాస్‌.. టాప్‌ 5లో నిలిచిన కంటెస్టెంట్లను వారి మరపురాని క్షణాలను పంచుకోవాలని సూచిస్తూనే అక్కడున్న కొన్ని ఫొటోలను బిగ్‌బాస్‌కు ఇవ్వాలని చెప్పాడు. ముందుగా మానస్‌ మాట్లాడుతూ.. టెడ్డీబేర్‌ టాస్కులో గెలిచినప్పుడు నేను, సన్నీ, అనీ మాస్టర్‌ను సంతోషంతో ఎత్తుకున్నాం.. అంటూ ఆ ఫొటోను బిగ్‌బాస్‌కిచ్చాడు.

షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ జర్నీలోనే బాధాకరమైన విషయం అమ్మ లెటర్‌ ముక్కలు కావడం అంటూ దానికి సంబంధించిన ఫొటోను బోర్డుపై పెట్టాడు. సిరి వంతు రాగా ‘బ్రిక్స్‌ ఛాలెంజ్‌ కంటే ముందు షణ్నుకు, నాకు గొడవ అయింది. ఫేక్‌ ఫ్రెండ్‌ అని తిట్టాను కానీ అది తప్పని ఈ టాస్క్‌తో రుజువైంది. ఈ జర్నీ మొత్తంలో నాకు అండగా నిలిచింది షణ్ను ఒక్కడే’ అని చెప్పుకొచ్చింది.

శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ఈ ఇంట్లో నాకు మంచి బాండ్‌ కుదురిన ఫస్ట్‌ పర్సన్‌ హమీదా. ఆమె వెళ్లిపోయాక చాలా బాధేసింది. చాలా మిస్‌ అవుతున్నాను, ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఈమె ఉండుంటే లోన్‌ రేంజర్‌ అన్న ట్యాగ్‌ వచ్చేది కాదని ఫీలయ్యాడు. తర్వాత సన్నీ వంతురాగా.. బేటన్‌ టాస్కులో నా టీమ్‌ వాళ్లే నన్ను వరస్ట్‌ పర్ఫామర్‌ అన్నారు. అప్పుడు జైల్లో పడి బాధపడితే మానస్‌ కూడా ఏడ్చాడు అని చెప్పుకొచ్చాడు. అందరినీ నవ్వించడమే తన నినాదంగా పేర్కొన్నాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM