Sreeleela : టాలీవుడ్‌కి ఎంతో మంది ముద్దుగుమ్మలు పరిచయం అయిన విషయం తెలిసిందే. వారిలో శ్రీలీల కూడా ఒకరు. ‘పెళ్లి సందD’ తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. ధమాకా సినిమాలో శ్రీలీల తన అందంతో రచ్చ చేసింది. ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. పూజ హెగ్డే, రష్మిక లాంటి టాప్ హీరోయిన్లకు కాంపిటీషన్ వచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే శ్రీలీలకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం హల్‌చల్ చేస్తుంది. శ్రీలీలకు సంబంధించి ఓ కన్నడ సినిమా షూటింగ్ వీడియో వైరల్ గా మారగా, ఇందులో అమ్మడి అందాలు చూస్తూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బీచ్ లో ఫైట్ ఫీట్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియో చూస్తుంటే శ్రీలీలకు అదే డెబ్యూ మూవీలా అనిపిస్తుంది. ఆ వీడియో చూసినవారంతా శ్రీలీలను ఇలా ఎప్పుడూ ఇంత హాట్‌గా చూడలేదంటూ కామెంట్స్ చేయడం విశేషం. కన్నడ హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి హిట్లే ఉన్నాయి. కన్నడలో శ్రీలీల మంచి ఫాంలో ఉండగానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు వారిని మెప్పించింది శ్రీలీల. తెలుగులో డెబ్యూతోనే శ్రీలీల అదరగొట్టేసింది. ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసి మెప్పించింది. ఇప్పుడు శ్రీలీల తన డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో అతి చిన్న హీరోయిన్‌గా రికార్డులు పొందిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చూస్తుంటే ఈ అమ్మడు రానున్న రోజులలో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…