Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలయ్య అఖండ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల అయ్యింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఫ్యాక్షనిజం, యాక్షన్ ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి అనే రాయలసీమ నాయకుడిగా, జై అనే యువకుడిగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.. వెండి తెరపై దుమ్మురేపిన ఈ సినిమా ఇకపై ఓటీటీలోనూ సందడి చేయబోతున్నది.
వీరసింహారెడ్డి సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఫిబ్రవరి 23వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా డిస్నీ పల్స్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్ డేట్ చూడగానే బాలయ్య అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పుడెడ్డుపా అని ఎదురుచూసిన సినిమా ఓటీటీలోకి వస్తోందని తెలిసి తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా వసూళు చేసింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళు చేసిన సినిమాగా నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లో 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు సహా పలువురు ఈ సినిమాలో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ లో కనిపించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…