Sreeleela : కన్నడ సోయగం శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నది ఈ కన్నడ బ్యూటీ .తన అందం, అభినయంతో.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పటికే.. కుర్ర హీరోల ఫేవరెట్ కో-స్టార్‌గా పేరు తెచ్చుకున్నది. ‘గుంటూరు కారం’లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో.. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవర్‌స్టార్ పవన్‌తో తెర పంచుకోనున్న ఈ భామ చివరిగా ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌తో పలకరించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హీరోలందరితో కలిసి సందడి చేస్తుంది. ఈ సంవత్సరం ఏకంగా స్కంద, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, ఆదికేశవ.. నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, భగవంత కేసరి చిత్రం మాత్రమే ఓకే అనిపించింది.
ఇక త్వరలోనే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో పలకరించనుంది. అయితే శ్రీలీల డాక్టర్ కాబోయి యాక్టర్ అయిందన్న విషయం తెలిసిందే. ఎంబీబీఎస్ చదువుకుంటూనే సినిమాలలోకి వచ్చింది. ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేసే ఆలోచనలో ఉంది. యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నా తన ఎడ్యుకేషన్ ని కూడా అలాగే మెయింటెన్ చేస్తోంది. ఒక వైపు షూటింగ్స్ చేస్తూనే షూట్ గ్యాప్ లోమెడిసిన్ బుక్స్ చదువుకునే శ్రీలీల ఇప్పుడు కొన్నాళ్లు షూట్స్ కి బ్రేక్ ఇచ్చింది అని సమాచారం. మెడిసిన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని, వాటి కోసం కొన్ని రోజులు గట్టిగా ప్రిపేర్ అయి ఎగ్జామ్స్ రాయాలని అందుకే సినిమాలకు శ్రీలీల చిన్న బ్రేక్ ప్రకటించినట్టు సమాచారం.
ఈ ఏడాది మొత్తం శ్రీలీలదే సందడి. వరుస సినిమా షూటింగ్స్, రిలీజ్ లు, ప్రమోషన్స్ తో తీరిక లేకుండా గడిపింది. చేతిలో పలు సినిమాలు ఉండగా, ఈ చిత్ర షూటింగ్‌లో కూడా క్షణం తీరికలేకుండా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులని, నెటిజన్లను అలరిస్తుంది. త్వరలోనే ఈ బ్యూటీ డాక్టర్ కూడా కాబోతుంది.అందాల నటి శ్రీలీల డాక్టర్ కాబోతుందని తెలిసి ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…