Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, శ్రీలీల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. కృతి ఉప్పెన సినిమాతో వెండితెరని పలకరించింది. టైటిల్‌కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునేలోపే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది.కానీ అంతలోనే టైమ్ రివర్స్ అయింది. వరసగా ఫ్లాపులొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. అదే సమయంలో ధమాకా చిత్రంతో మంచి హిట్ కొట్టిన శ్రీలలకి వరుస అవకాశాలు దక్కాయా. కృతిని పక్కన పెట్టి అందరు శ్రీలలకి వరుస అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు.
స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం రావడంతో స్క్రిప్ట్, క్యారెక్టర్స్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా అన్నింటికి సైన్ చేసింది. అది ఎంత పెద్ద తప్పు అనేది ఇప్పుడు అర్ధమవుతుంది. ఇటీవల శ్రీలీల చేసిన స్కంద, ఆదికేశవతో పాటు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో ఫ్లాపుల విషయంలో హ్యాట్రిక్ కొట్టింది. భగవంత్ కేసరిలోశ్రీలీలకి సవాల్ విసిరే పాత్ర దక్కింది. ఈ సినిమాతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె నటించిన స్కంద, ఆదికేశవతోపాటు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లలో కేవలం పాటలతో పాటు కొన్ని సన్నివేశాలకు పరిమితమయ్యే పాత్రల్లోనే కనిపించింది. ఆ సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో శ్రీలీల పరిస్థితి ఇప్పుడు డేంజర్‌లో పడింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవర్‌స్టార్ సరసన నటిస్తున్నది. త్రివిక్రమ్, మహేశ్‌బాబు కాంబోలో నిర్మితమవుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంలోనూ శ్రీలీలను కథానాయిక పాత్ర వరించింది. అయితే ముందు మహేష్ బాబు సినిమా రిలీజ్ కానుండగా, ఈ సినిమా హిట్ అయితేనే శ్రీలీలీ కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటుంది. లేదంటే ఈ అమ్మడి పరిస్థితి కృతి శెట్టి మాదిరిగానే మారడం ఖాయం అంటున్నారు.