Sonu Sood : సోనూసూద్.. ఇతను రీల్ లైఫ్‌లో విలన్ కావచ్చు కాని రియల్ లైఫ్‌లో మాత్రం హీరో. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు రియల్ హీరో సోనూసూద్. కరోనా సమయంలో సోనూసూద్ ఎంతో మందికి సేవలందించారు. గొప్ప సేవా కార్యక్రమాలు చేశారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా అందరికి సేవలు అందించిన సోనూసూద్‌ని కొందరు దేవుడిగా భావించి ఆయనకు గుడులు కూడా కట్టారు. సోనూసూద్ రాజకీయాల్లో కి వస్తే సక్సెస్ సాధించడం తో పాటు మరిన్ని సంచలన విజయాలను ఖాతా లో వేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
సోనూసూద్ మంచితనమే సోనూసూద్ పాలిట శాపమైందని కరోనా తర్వాత తెలుగు సినిమాలలో సోనూసూద్ కు ఆఫర్లు తగ్గాయని కొందరు చెప్పుకొస్తున్నారు. సోనూసూద్‌కి వచ్చిన క్రేజ్‌తో ఆయనకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు. కాని ఇతర భాష ల్లో సైతం గతంలోలా మూవీ ఆఫర్లు అయితే రావడం లేదు. అయితే తాజాగా సోనూసూద్ మరోసారి తన మంచి మనసుతో వార్తలలోకి ఎక్కారు. తండ్రి ఆపరేషన్ కోసం బాధపడుతున్న యువకుడికి భరోసా ఇచ్చారు. యూపీ లోని డియోరియా కు చెందిన పల్లవ్ సింగ్ అనే వ్యక్తి తన తండ్రి గుండె కేవలం 20 శాతం మాత్రమే పని చేస్తోందని తండ్రి బ్రతకాలంటే ఆపరేషన్ అవసరమని సోషల్ మీడియా ద్వారా చేశారు.

అయితే తండ్రి కోసం తనయుడు పడుతున్న ఆవేదనకి చలించిన సోనూసూద్ స్పందించారు. మేము మీ తండ్రి ని చనిపోనివ్వము సోదరా.. నా పర్సనల్ సోషల్ మీడియా ఐడీ ఇన్ బాక్స్ కు డైరెక్ట్ గా మీ నంబర్ పోస్ట్ చేయండి.. దయచేసి ట్వీట్‌లో పోస్ట్ చేయవద్దు” అని సోనూసూద్ కామెంట్ చేశారు.సోనూసూద్ పోస్ట్ కు 9,200కు పైగా లైక్స్ వచ్చాయి. కరోనా సమయం నుండి సోనూసూద్ నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే వస్తున్నారు. అయితే పల్లవి సింగ్ తండ్రి విషయంలో సోనూసూద్ త్వరగా స్పందించారు. సెప్టెంబర్ 15 న పల్లవ్ సింగ్ తండ్రికి గుండెపోటు వచ్చింది. మూడు సార్లు గుండె పోటు రాగా, ధమనుల్లో బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎయిమ్స్‌లో తన తండ్రిని పరీక్షలు జరిపించగా, గుండె బలహీనంగా ఉందని, ఆపరేషన్ జరగాలంటే 13 నెలలు వెయిటింగ్ లో ఉండాలని, అది కూడా లక్షలు చెల్లిస్తే కాని.. ఆపరేషన్ జరగదని తేల్చేశారు. పల్లవ్ సింగ్‌కి అంత స్థోమత లేకపోగా, ఆపన్నహస్తం కోసం సోనూసూద్‌ని సంప్రదించగా ఆయన వెంటనే రియాక్ట్ అయ్యాడు.