Skanda OTT Release Date : రామ్ పోతినేని హీరోగా వచ్చిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. అయితే, బోయపాటి దర్శకత్వంలో రామ్ సినిమా కాబట్టి, భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ, ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదు. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్లను కూడా రాబట్ట లేకపోయింది. ఇక ఇప్పుడు స్కంద సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ డేట్ బయటికి వచ్చింది.
స్కంద ఓటీటీ హక్కులని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. అక్టోబర్ 27వ తేదీ నుండి, స్కంద సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటుగా, ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం లో కూడా స్ట్రీమింగ్ కి రాబోతోంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమాని, ఫుల్ యాక్షన్ మూవీగా తెర మీదకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా ఉన్నాయి.
మాస్ యాక్షన్ లుక్ లో రామ్ పోతినేని కనపడి, బాగానే ఆకట్టుకున్నారు. కానీ, సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామ్ పోతినేని సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. అలానే, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, ప్రిన్స్ సెసిల్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, పృథ్వీరాజ్ కీలక పాత్రలలో కనపడ్డారు.
బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను కూడా రాబట్ట లేకపోయింది. ఇది ఇలా ఉంటే, రామ్ ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా, ఈ సినిమాను తెరమీదకి తీసుకు రానున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…