Siren 108 Movie On OTT : వెంకటేష్, మీనా కలసి నటించిన దృశ్యం సినిమా రెండు పార్టులుగా వచ్చిన విషయం విదితమే. ఈ రెండు మూవీలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఒరిజినల్ మళయాళం అయినప్పటికీ తెలుగు ప్రాంతీయతకు అనుగుణంగా సినిమాలను రూపొందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో సినిమాలు సాగుతాయి. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో చాలానే వస్తున్నాయని చెప్పవచ్చు. అవి థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొంటున్నాయి. ఇక అలాంటి మూవీల్లో జయం రవి నటించిన సైరన్ 108 కూడా ఒకటి. ఇందులో రవితోపాటు కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటీటీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకులు ఈ మూవీని ఎక్కువగా వీక్షిస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ మూవీలను సరైన కథతో తీయాలేకానీ పెద్ద హిట్ అవుతాయి. అందుకు గతంలో ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలే ఉదాహరణలని చెప్పవచ్చు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ఓ సినిమా కథ ఇలాగే ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాలో హీరో తన శత్రువులందరినీ ఒక ఆట ఆడుకుంటాడు. ఇక సైరన్ 108లో కీర్తి సురేష్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ రివేంజ్ డ్రామాతో నడుస్తుంది. ప్రతి సన్నివేశం కట్టిపడేస్తుంది. ఈ సినిమా ముందు దృశ్యం చాలా తక్కువ అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక సైరన్ 108 సినిమా విషయానికి వస్తే తన భార్యను హత్య చేసిన ఓ తప్పుడు కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆంబులెన్స్ డ్రైవర్ తిలక్. (జయం రవి) చుట్టూ సినిమా కథ నడుస్తుంది. అతనికి పదే పదే పరోల్ ఇస్తుంటారు. కానీ అతను తిరస్కరిస్తుంటాడు. ఇక ఒక రోజు పరోల్‌పై వెళ్లాలని నిర్ణయించుకుని ఇంటికి చేరుకుంటాడు. తరువాత తన శత్రువులందరూ చనిపోతుంటారు. చివరికి కథ రివీల్ అవుతుంది. అందరూ ఒక్కసారిగా షాకవుతారు. ఇలా ఈ సినిమా ఆద్యంతం ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఇందులో ఎక్కడా బోర్ కొట్టే సీన్లు లేవు.
ఇక ఈ మూవీ థియేటర్లలో అలరించగా ప్రస్తుతం ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీని తెలుగుతోపాటు హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ఈ మూవీకి ఐఎండీబీలో 10కి 6.5 రేటింగ్ రావడం విశేషం కాగా ఈ సినిమాను ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో వీక్షించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…