Shriya Saran : ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ శ్రియ. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది అందాల ముద్దుగుమ్మ. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో తెగ యాక్టవ్‌గా ఉంటూ నానా రచ్చ చేస్తుంది. తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.
వయసు పెరుగుతున్నా కూడా శ్రియ గ్లామర్ మాత్రం ఏమి తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు అరాచకం సృష్టిస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు వెరైటీ డ్రెస్సులలో కనిపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ట్రెండీ దుస్తులలోను, చీరకట్టులోను శ్రియ అందాల అరాచకం ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా శ్రియ బ్లాక్ కలర్ శారీలో మెరిసింది. శ్రియ ఫోటోల ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. హాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో కవ్విస్తుంది శ్రియ. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. పలుచని శారీలో పరువాల విందు చేస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్రియ తేనెకత్తుల్లాంటి నవ్వులతో అల్లకల్లోలం సృష్టిస్తుంది.

నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ అదే అందంతో ఫ్యాన్స్‌ను కవ్విస్తుంది అందాల శ్రియ. అమ్మడి అందాల విస్పోటనం చూసి ఎవ్వరు కూడా తట్టుకోలేకపోతున్నారు. పెళ్ళై, పిల్లలు పుడితే అందం పాడవుతుందని అనుకుంటున్న వారికి శ్రియ బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఇప్పటికీ శ్రియ హీరోయిన్‌గా చేసే అవకాశం ఉంది. కుర్ర హీరోలని మించిన అందంతో రచ్చ చేస్తుంది. సీనియర్ హీరోలకి ఈ అమ్మడు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.