Shivaraj Kumar Ghost Movie OTT Release Date : శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఈ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలై ప్రేక్షకులని అలరించింది. చిత్రంలో శివరాజ్ కుమార్ వన్ మ్యాన్ షో మాదిరిగా అలరించాడు.డ్యూయెట్, హీరోయిన్ లేకపోవడం రెగ్యులర్ ఆడియెన్స్‌కు కొంత నిరాశ పరిచింది.
చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ అర్చన జాయిస్ ఉంది కానీ.. ఆమె క్యారెక్టర్‌కు పెద్దగా ప్రధాన్యం ఉన్నట్టు కనిపించదు. ఇతర పాత్రల్లో కనిపించిన వారు ఫర్వాలేదనిపించారు. చిత్రం రిలీజ్ అయిన తర్వాత ప్రతి సినిమా ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘోస్ట్ సినిమా నవంబర్ 17వ తేదీన జీ5 ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.థియేటర్స్‌లో సినిమాని ఫుల్‌గా ఎంజాయ్ చేసిన వారు ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. చిత్రంలో శివ రాజ్ కుమార్ హైలైట్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు దర్శకుడు శ్రీని తనదైన విజన్ తో హీరోయిజం నీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు.

ఘోస్ట్ చిత్రంలో ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపించారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేసారు.మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాసారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందించారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేసింది.