Sandeep Reddy Vanga : డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్ సినిమాపై ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి అంటూ టాలీవుడ్‌ను, ఆ కథను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌ను అల్లాడించాడు సందీప్ . షాహిద్ కపూర్‌తో చేసిన కబీర్ సింగ్ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా రాబట్టింది. అలా సందీప్ రెడ్డి వంగా ఏకంగా బాలీవుడ్‌కే పరిమితం అయ్యాడు. రెండో సినిమాను అక్కడే తీశాడు. రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ అంటూ తీశాడు. ఈ సినిమా రన్ టైమ్ లెంగ్త్ చూసి, నెటిజన్లే కాదు, సినీ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘‘యానిమల్’ నిడివి 3 గంటలా 21 నిమిషాలా 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్’’ అంటూ సందీప్ తెలిపారు. అయితే ఇక్కడే మరో షాకింగ్ విషయం రివీల్ అయ్యింది.
సందీప్ వంగా ఈ సినిమాని 3 గంటల 49 నిముషాలకు సెట్ చేశారు. అది చాలా ఎంగేజింగ్ గా ఉంది. కానీ తర్వాత దాన్ని 3 గంటలా 21 నిమిషాలకు ట్రిమ్ చేసారు జ ఈ మధ్య కాలంలో రిలీజైన చిత్రాల్లో ఎక్కువ లెంగ్త్ ఉన్న బాలీవుడ్ చిత్రం ఇదే కానుంది. అయితే ఈ సినిమాకి ఎ సర్టిఫికెట్ ఇవ్వడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి మాత్రం సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా లేదని అతడు చెప్పుకు రావడం విశేషం. 18 ఏళ్ల లోపు వారికి ఇది సూటయ్యే సినిమా కాదు. అని, నా కొడుకు అర్జున్, నా సోదరుడి పిల్లలు లేదంటే కజిన్స్ పిల్లలను కూడా థియేటర్లకి ఈ సినిమాని తీసుకెళ్లను. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.

నా కుటుంబంలో 8 నెలల నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు చాలా మందే ఉన్నారు , వారిని ఈ సినిమా చూడకుండా జాగ్రత్త పడతాను అని సందీప్ చెప్పుకొచ్చారు. రీసెంట్‌గా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ ఈవెంట్‌లో మాట్లాడిన సందీప్.. ఈ కథను ఎవరి దగ్గరకు తీసుకెళ్లినా ఈజీగా రిజెక్ట్ చేయవచ్చు.. ఇదేం కథా.. ఇలా ఉంది.. అని అనొచ్చు.. కానీ రణ్‌బీర్ కపూర్ నన్ను నమ్మాడు.. సినిమా చేశాడు.. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి తండ్రీ కొడుకుల కథ రాలేదు.. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను.. సినిమా నిడివి గురించి మీరు అస్సలు బాధపడొద్దు.. సినిమా బాగుంటుంది.. మంచి సినిమా తీశానని నమ్ముతున్నాను.. ప్రతీ ఫ్రేమ్ బాగుంటుంది.. స్టార్టింగ్.. ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ కావొద్దు అంటూ పదే పదే చెప్పుకొచ్చాడు సందీప్ వంగా.