Samantha : అల్లు అర్జున్ తాజాగా నటించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన ఈ మూవీకి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించి మెప్పించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
కాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు సుకుమార్ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సమంత స్పెషల్ సాంగ్ గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. సమంతను స్పెషల్ సాంగ్ చేయాలని అడిగితే వెంటనే వద్దని చెప్పిందని అన్నారు. తాను ఈ ఐటమ్ సాంగ్ చేయలేనని సమంత చెప్పిందని, అయితే తాను ఆమెను కన్విన్స్ చేశానని తెలిపారు.
ఈ పాట మీకు బాగా యాప్ట్ అవుతుంది, గతంలో రంగ స్థలంలో పూజా హెగ్డెకు కూడా ఆ పాట ప్లస్ అయింది. అలాగే ఈ పాట మీకు కొత్తగా ఉంటుందని.. సమంతతో చెప్పానని.. దీంతో సమంత వెంటనే పాటను చేసేందుకు అంగీకరించిందని.. సుకుమార్ చెప్పారు. కాగా ఈ పాట ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఓ వైపు ఈ పాటను తొలగించాలని ఏపీకి చెందిన పురుష సంఘం కేసు పెట్టగా.. చిత్ర సంగీత దర్శకుడు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు.