Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా మంచి పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపోయారు. అనుకోని కారణాల వలన ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేయడం మనం చూశాం. తమ విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వచ్చింది.
ఇటీవల సమంత, నాగ చైతన్య తిరిగి కలిసారని ప్రచారం జరిగింది. అందుకు కారణం నాగ చైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు వారి వద్ద హ్యాష్ అనే పెంపుడు కుక్క ఉండేది. నాగచైతన్యతో విడిపోయాక సమంత దాన్ని తనతో తీసుకెళ్లారు. అయితే, ఇటీవల యూరప్ ట్రిప్‍కు హ్యాష్‍ను తీసుకెళ్లిన ఫొటోను నాగచైతన్య షేర్ చేయడంతో సమంత దగ్గర ఉన్న పెంపుడు కుక్క నాగ చైతన్యతో ఉందని, వారిద్దరూ మళ్లీ కలిసిపోనున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని వారి సన్నిహితులు తెలియజేశారు. అయితే సమంత, నాగ చైతన్య తిరిగి కలవడం మాత్రం అసాధ్యం అని కొందరు అనేవాళ్లు లేకపోలేదు.

అయితే కనీసం సినిమాలలో అయిన సరే సమంత, నాగ చైతన్య కలిసి కనిపిస్తే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు. అయితే వారిని ఆనందపరచేందుకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. నాగ చైతన్య ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఇందులో కీర్తిసురేష్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఇందులో సమంత రంగస్థలంలో చెప్పిన ఓ డైలాగ్ ను వాడబోతున్నారట. నాగచైతన్య నాకు ఏమీ అభ్యంతరం లేకపోవడంతో సమంత డైలాగ్‌ని వాడబోతున్నారని తెలిసింది. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఇంత పాజిటివ్‌గా స్పందించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.