వినోదం

Samantha : నిర్మాత‌గా మారిన స‌మంత‌.. నిర్మాణ సంస్థ‌కి కొత్త పేరు పెట్టేసిందిగా..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత దూకుడు మీద ఉంది. కొంత కాలంగా పంథాను మార్చుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది వచ్చిన ‘యశోద’తో బిగ్గెస్ట్ సోలో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేసింది. అయితే, ఈ ఏడాది ఆమె నటించిన ‘శాకుంతలం’, ‘ఖుషి’ మూవీలు చేసింది. కానీ, ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూసేశాయి. కెరీర్ ఆరంభం నుంచీ సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు పెద్దగా మూవీలను చేయడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘సీటాడెల్’ వెబ్ సిరీస్‌లో మాత్రమే ఉంది. ఇది మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీని కోసం ఆమె అభిమానులు అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

సినిమాల‌కి కాస్త దూరంగా ఉంటున్న స‌మంత తాజాగా ఆమె ప్రొడక్షన్‌ హస్‌ ప్రారంభించింది. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌కు ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. తనకు బాగా ఇష్టమైన సాంగ్‌ ‘బ్రౌన్‌ గర్ల్‌ ఈజ్‌ ఇన్‌ ది రింగ్‌ నౌ’ (హాలీవుడ్‌) లిరిక్స్‌ స్ఫూర్తితో ట్రాలాలా అని పేరు పెట్టానని అన్నారు. న్యూ టాలెంట్స్‌ పోత్సహించడమే తన సంస్థ లక్ష్యమన్నారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే అర్థవంతమైన, యూనివర్సల్‌ స్టోరీలు చెప్పగలిగే దర్శకులకు ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ వేదికగా నిలుస్తుంది’’ అని అన్నారు. సమంత పోస్ట్‌ చూసిన చాలామంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.

Samantha

కామెడీ, ఎమోషన్స్‌ను నేను బాగా డీల్‌ చేయగలను. యాక్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నా. ప్లీజ్‌ మేడమ్‌.. నాకో అప్లికేషన్‌ ఇవ్వండి’’ అంటూ దర్శకురాలు నందిని రెడ్డి సరదాగా కామెంట్‌ చేశారు. ‘కంగ్రాట్స్‌.. మేడమ్‌ మీ సినిమాల్లో యంగ్‌ హీరో అవసరం ఉంటే నాకు కాల్‌ చేయండి’ అని నటుడు తేజ సజ్జ కామెంట్‌ చేశారు. మొత్తానికి స‌మంత కొత్త ప్ర‌యాణం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇందులో ఎంత స‌క్సెస్ అవుతుంద‌నేది చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM