Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత దూకుడు మీద ఉంది. కొంత కాలంగా పంథాను మార్చుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది వచ్చిన ‘యశోద’తో బిగ్గెస్ట్ సోలో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేసింది. అయితే, ఈ ఏడాది ఆమె నటించిన ‘శాకుంతలం’, ‘ఖుషి’ మూవీలు చేసింది. కానీ, ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూసేశాయి. కెరీర్ ఆరంభం నుంచీ సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు పెద్దగా మూవీలను చేయడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘సీటాడెల్’ వెబ్ సిరీస్‌లో మాత్రమే ఉంది. ఇది మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీని కోసం ఆమె అభిమానులు అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
సినిమాలకి కాస్త దూరంగా ఉంటున్న సమంత తాజాగా ఆమె ప్రొడక్షన్ హస్ ప్రారంభించింది. ఆ ప్రొడక్షన్ హౌస్‌కు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. తనకు బాగా ఇష్టమైన సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఈజ్ ఇన్ ది రింగ్ నౌ’ (హాలీవుడ్) లిరిక్స్ స్ఫూర్తితో ట్రాలాలా అని పేరు పెట్టానని అన్నారు. న్యూ టాలెంట్స్ పోత్సహించడమే తన సంస్థ లక్ష్యమన్నారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే అర్థవంతమైన, యూనివర్సల్ స్టోరీలు చెప్పగలిగే దర్శకులకు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ వేదికగా నిలుస్తుంది’’ అని అన్నారు. సమంత పోస్ట్ చూసిన చాలామంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.

కామెడీ, ఎమోషన్స్‌ను నేను బాగా డీల్ చేయగలను. యాక్షన్ కోసం ప్రయత్నిస్తున్నా. ప్లీజ్ మేడమ్.. నాకో అప్లికేషన్ ఇవ్వండి’’ అంటూ దర్శకురాలు నందిని రెడ్డి సరదాగా కామెంట్ చేశారు. ‘కంగ్రాట్స్.. మేడమ్ మీ సినిమాల్లో యంగ్ హీరో అవసరం ఉంటే నాకు కాల్ చేయండి’ అని నటుడు తేజ సజ్జ కామెంట్ చేశారు. మొత్తానికి సమంత కొత్త ప్రయాణం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో ఎంత సక్సెస్ అవుతుందనేది చూడాలి.