Samantha : ఏ మాయ చేశావే అనే చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సమంత నాగ చైతన్య నాలుగేళ్ల వివాహ బంధానికి బ్రేకులు పడిన విషయం తెలిసిందే. 2017 అక్టోబర్ 7 న వీరిద్దరి వివాహం జరిగింది. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో సమంత సోషల్ మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పేరు తీసేసింది. దీంతో ఏదో జరిగిందని అందరు భావించారు . కాని కొద్ది రోజులకి అంటే 2021 అక్టోబర్ 2న తమ విడాకులు ప్రకటించారు. సమంత చేస్తున్న కొన్ని షూటింగ్స్ ను మానేయాలని..అమల లాగా ఇంట్లోనే ఉండాలంటూ కుటుంబ సభ్యులు సూచించారని, దానికి సుముఖంగా లేకపోవడం వలన సమంత విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఇప్పటి వరకు ఇద్దరి విడాకుల గురించి జరుగుతున్న ప్రచారం పైన ఇద్దరి నుంచి స్పష్టత రాలేదు. అయితే తాజాగా కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. .సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో సమంత- నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయట. అప్పుడు .. నాగచైతన్య.. సమంత మీద ఉన్న ద్వేషంతో మరో హీరోయిన్ తో క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ హీరోయిన్ మరెవ్వరో కాదు శోభిత ధూళిపాళ్ల. ఈ విషయాన్ని సమంత సన్నిహితులే ఆమె వద్ద చెప్పారట. దీంతో చెప్పుడు మాటలు విన్నటువంటి సమంత నాగచైతన్యకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

అక్కినేని కుటుంబంతో సమంతకి పొసగని కారణంగానే ఈ జంట మధ్య విబేధాలు మొదలయ్యాయన్నది ప్రధాన ప్రచారం. అక్కినేని కుటంబ కట్టుబాట్లకు సమంత అడ్జెస్ట్ అవ్వలేకపోవడం.. చైతూ దీనిపై సమంతను గైడ్ చేయడం నచ్చని కారణంగానే వీరిద్దరి మధ్య తరచుగా గొడవలకు దారితీసిందని, కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీ లైఫ్ తో కుటుంబంలో కలిసి ప్రయాణించే సమయం లేకపోవడం.. చివరికి అది ఈగో సమస్యగా మారి చివరికి విడాకులకు దారితీసినట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విడిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ సమంత-చైతూకి సంబంధించి నెట్టింట ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది.