Salaar Shirts : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయనకి తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సలార్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్.
సలార్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో హాంబులే ఫిలిమ్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. కాగా ఇందులో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ కనిపించబోతోంది. మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సలార్ చిత్రాన్ని డిసెంబర్ 22 న విడుదల చేయబోతున్నట్టు ఓ ప్రచారం నడుస్తుంది. . ఈ నేపద్యంలోనే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సలార్ సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దాంతో ఒకవైపు సోషల్ మీడియాలో సలార్ హాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

మరి కొద్ది రోజులలో సలార్ సినిమా విడుదల కానుండగా,ఈ సినిమా కోసం త్వరలోనే ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. దాంతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ ను సైతం జరుపుతారట. దాంతోపాటు అన్ని భాషల మీడియాతో ప్రభాస్ ఇంట్రాక్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో సలార్ టీ షర్ట్స్ సందడి చేస్తున్నాయి. ఇకపోతే, సలార్ ప్రమోషన్స్ లో భాగంగా హోంబలే ఫిల్మ్స్ సలార్ టీ షర్ట్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధర 500నుంచి 1500 వరకూ ఉంది. ఇవి hombaleverse వెబ్ సైట్లో లభిస్తాయి.టీషర్ట్ ను బట్టి వివిధ ధరల్లో అవి అందుబాటులో ఉన్నాయి. అయితే అంత ధరలు పెడితే సామాన్యులు ఎలా కొంటారని కొందరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.