Salaar Remuneration : ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.దీంతో చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్.. నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా. ఇన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నీల్. ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నీల్.. ఇప్పుడు మరోసారి సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు.
ఈ సినిమాకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో మంచి రెస్పాన్స్ వస్తుంది. రానున్న రోజులలో ఈ సినిమా సంచలనాలు సృష్టించనుందని చెబుతున్నారు.అయితే తాజాగా ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో ఎవరెవరు ఏ రేంజ్ లో పారితోషికాలను అందుకున్నారో చూస్తే.. హీరో ప్రభాస్ దాదాపుగా 100 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా లాభాల్లో కూడా 10 శాతం షేర్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి దాదాపు రూ.50 కోట్లు, శృతి హాసన్‌కి రూ.8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతిబాబు తలో రూ.4 కోట్ల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం.మొత్తం మూవీ బడ్జెట్ రూ 400 కోట్ల వరకు ఉంటుందని టాక్.

అంటే ఓవరాల్ బడ్జెట్‌లో సగం రెమ్యునరేషన్స్‌కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది.సలార్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే 400 కోట్లు రాబట్టడం పెద్ద సంగతి ఏమి కాదు అని తెలుస్తోంది.ఎలాంటి ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ లేకుండానే ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. సలార్ విడుదలకు కోసం చాలాకాలంగా ఎదురుచూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హడావిడి గురించి చెప్పక్కర్లేదు.