Salaar OTT : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా సలార్ మ్యానియా నడుస్తుంది. ఈ రోజు సలార్ చిత్రం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ మంచి ఆదరణ దక్కించుకుంటుంది. హైదరాబాద్ లోని అన్ని థియేటర్ల వద్ద సలార్ మేనియా కనిపిస్తోంది. గత అర్ధ రాత్రి నుంచే థియేటర్స్ హోరెత్తిపోతుండగా, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం సలార్ థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉండగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
‘సలార్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఆ ఐదు భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘సలార్’ థియేటర్లలో విడుదల అయ్యే వరకు ఓటీటీ పార్ట్నర్ ఎవరు? అనేది సీక్రెట్‌గా ఉంచారు. అయితే సిల్వర్ స్క్రీన్ మీద తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ అని అనౌన్స్ చేయడంతో ఆ ప్లాట్‌ఫాంలో సలార్ స్ట్రీమింగ్ కానుందని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా కోసం సుమారు 200 కోట్లకు అటు ఇటుగా డీల్ జరిగిందని టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్ట్‌లుగా సలార్ తెరకెక్కింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అంటూ ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుంచే నైజాం ఏరియాలోని 20 థియేటర్లలో బెనిఫిట్ షోలు పడ్డాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం సలార్ చిత్రాన్ని థియేటర్స్‌లో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. హీరో నితిన్, శ్రీవిష్ణు థియేటర్‌లో సలార్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వరుస ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌కి పెద్ద హిట్ రావడంతో అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…