Salaar Breakeven : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎంతో ఆసక్తిగా సలార్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.శృతి హాసన్ హీరోయిన్ గా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం సలార్. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయింది. అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇటు ప్రశాంత్ నీల్ అభిమానులు సినిమా కోసం తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ఎదురు చూడడమే కాదు.. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. స్టార్ హీరోల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంతా ఈ సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకున్నారు.
రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌తో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. సలార్ చిత్రం హిందీలో సేఫ్ జోన్‌కి వెళ్లాలంటే రూ.200 కోట్లు రాబట్టాల్సి ఉంటుందట. అయితే సలార్‌కి పోటీగా షారూఖ్ డంకీ చిత్రం వస్తుంది. డిసెంబర్ 21న ఈమూవీ రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ కంటే డంకీ ముందుంది. ఒక రోజు ముందే రిలీజ్ కానుండటంతో ఒకవేళ డంకీకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చి సినిమా హిట్ అయితే సలార్‌పై తప్పక ఎఫెక్ట్ పడే అవకావం ఉందని అంటున్నారు. డంకీ సక్సెస్ అయితే సలార్ చిత్రం హిందీ మార్కెట్ లో రూ.200 కోట్ల నెట్ మార్క్ అందుకోవడం అంత సులువు కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో సోమవారానికి సలార్ కంటే డంకీనే ఎక్కువ తొలి రోజు వసూళ్లు సాధించింది.

డంకీ మూవీకి రూ.7.36 కోట్లు రాగా.. సలార్ కు అన్ని భాషల్లో కలిపి రూ.6 కోట్లు వచ్చాయి. డంకీ కేవలం హిందీలోనే రిలీజ్ అవుతుండగా.. సలార్ మాత్రం తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. సలార్ మేకర్స్ తెలుగు మార్కెట్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ సొంత రాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. కన్నడలో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటి వరకూ కేవలం రూ.9.9 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అనూహ్య స్పందన వచ్చింది. యూట్యూబ్ అంతా షేక్ అయిపోయేలా వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం ఆయన నెక్స్ట్ సినిమాలకే సాధ్యం అవుతోంది అని ఫ్యాన్స్ అంటున్నారు.