వినోదం

Salaar 7 Days Box Office Collections : బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టిన స‌లార్.. ఇండియాలో వారంకి గాను ఎంత రాబ‌ట్టింది అంటే…!

Salaar 7 Days Box Office Collections : ‘బాహుబలి’ సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు తన స్టామినాను కూడా చూపించిన న‌టుడు ప్ర‌భాస్. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ప‌లు చిత్రాలు చేసిన కూడా ఆయ‌న‌కి మంచి విజ‌యాలు ద‌క్క‌లేదు. మూడు ఫ్లాపుల త‌ర్వాత స‌లార్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఎలాగైనా గట్టిగా కొట్టాలన్న పట్టుదలతో ‘సలార్: సీజ్‌ఫైర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ ఈ చిత్రంతో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు.. షారుక్ ఖాన్ డంకీ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. ఆ మూవీని వెనక్కి నెట్టి మ‌రీ దానికంటే రెట్టింపు వసూళ్లు రాబ‌డుతుంది ఈ చిత్రం. ఇండియాలో ఏకంగా ఈ చిత్రానికి రూ.300 కోట్ల వ‌సూళ్లు ద‌క్క‌డం విశేషం.

స‌లార్ చిత్రం 6 రోజుల్లో తెలుగులో రూ. 126.32 కోట్లు, తమిళంలో రూ. 9.05 కోట్లు, కర్నాటకలో రూ. 18.50 కోట్లు, కేరళలో రూ. 5.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 48.60 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 253.77 కోట్లు షేర్, రూ. 500 కోట్లు గ్రాస్ వచ్చింది.ఇండియాలో రూ.300 కోట్లను దాటింది. ఏడో రోజు రూ.10 కోట్లలోపే వసూళ్లు సాధించినా.. చివరికి రూ.304 కోట్ల నెట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.క్రిస్మ‌స్ వ‌ర‌కు మంచి వసూళ్లు రాబ‌ట్టిన రాను రాను క‌లెక్ష‌న్స్ డ్రాప్ అవుతున్నాయి.

Salaar 7 Days Box Office Collections

తొలి రోజు ఇండియాలో రూ.90.7 కోట్లతో రికార్డు క్రియేట్ చేసిన సలార్ చిత్రం.. రెండో రోజు రూ.56.35 కోట్లు, మూడో రోజు రూ.62.05 కోట్లు, నాలుగో రోజు రూ.46.3 కోట్లు, ఐదో రోజు రూ.24.9 కోట్లు, ఆరో రోజు రూ.15.1 కోట్లు వసూలు చేసింది. ఏడో రోజు మరో రూ.8 కోట్ల వసూళ్లతో మొత్తంగా రూ.300 కోట్ల మార్క్ దాటింది. తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ.190 కోట్ల వరకూ రావడం విశేషం.సలార్: సీజ్‌ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 6 రోజుల్లో దీనికి రూ. 253.77 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 93.23 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM