Salaar 7 Days Box Office Collections : ‘బాహుబలి’ సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు తన స్టామినాను కూడా చూపించిన నటుడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ పలు చిత్రాలు చేసిన కూడా ఆయనకి మంచి విజయాలు దక్కలేదు. మూడు ఫ్లాపుల తర్వాత సలార్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఎలాగైనా గట్టిగా కొట్టాలన్న పట్టుదలతో ‘సలార్: సీజ్‌ఫైర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ చిత్రంతో సంచలనాలు సృష్టిస్తున్నాడు.. షారుక్ ఖాన్ డంకీ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. ఆ మూవీని వెనక్కి నెట్టి మరీ దానికంటే రెట్టింపు వసూళ్లు రాబడుతుంది ఈ చిత్రం. ఇండియాలో ఏకంగా ఈ చిత్రానికి రూ.300 కోట్ల వసూళ్లు దక్కడం విశేషం.
సలార్ చిత్రం 6 రోజుల్లో తెలుగులో రూ. 126.32 కోట్లు, తమిళంలో రూ. 9.05 కోట్లు, కర్నాటకలో రూ. 18.50 కోట్లు, కేరళలో రూ. 5.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 48.60 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 253.77 కోట్లు షేర్, రూ. 500 కోట్లు గ్రాస్ వచ్చింది.ఇండియాలో రూ.300 కోట్లను దాటింది. ఏడో రోజు రూ.10 కోట్లలోపే వసూళ్లు సాధించినా.. చివరికి రూ.304 కోట్ల నెట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.క్రిస్మస్ వరకు మంచి వసూళ్లు రాబట్టిన రాను రాను కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి.

తొలి రోజు ఇండియాలో రూ.90.7 కోట్లతో రికార్డు క్రియేట్ చేసిన సలార్ చిత్రం.. రెండో రోజు రూ.56.35 కోట్లు, మూడో రోజు రూ.62.05 కోట్లు, నాలుగో రోజు రూ.46.3 కోట్లు, ఐదో రోజు రూ.24.9 కోట్లు, ఆరో రోజు రూ.15.1 కోట్లు వసూలు చేసింది. ఏడో రోజు మరో రూ.8 కోట్ల వసూళ్లతో మొత్తంగా రూ.300 కోట్ల మార్క్ దాటింది. తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ.190 కోట్ల వరకూ రావడం విశేషం.సలార్: సీజ్‌ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 6 రోజుల్లో దీనికి రూ. 253.77 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 93.23 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.