Sai Pallavi : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోలని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించేసింది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సాయి పల్లవి ఇటీవలి కాలంలో చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ. గతకొంతకాలంగా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో ఈ సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ.
తెలుగులో ఈ చిన్నది చివరిగా రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమాలో కనిపించింది. తమిళ్ లో గార్గి సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఆతర్వాత సాయి పల్లవి సైలెంట్ అయ్యింది. ఆమె నుంచి కొత్త సినిమా ఏది రాకపోవడంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని అందరు అనుకున్నారు. మరి కొందరు ఈ అమ్మడు సినిమాలు మానేసిందని, డాక్టర్స్ గా సెటిల్ కాబోతుందని వార్తలు వచ్చాయి. కొంతమంది ఏకంగా పెళ్లి చేసుకోనుందని కూడా ప్రచారం చేశారు. అయితే శివ కార్తికేయన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది సాయి పల్లవి.
తెలుగులో ఎవరితో సాయిపల్లవి సినిమా చేస్తుందని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతుంది.ఈ సినిమాల్లో సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ముందుగా ఈ పాత్ర కోసం జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి గ్లామరస్ బ్యూటీలను అనుకున్నారని ..కధ పరంగా చాలా డెప్త్ ఉండడంతో సాయి పల్లవి లాంటి కథానాయికని తీసుకుంటే సినిమాకి డెప్త్ వస్తుందని ఆమెని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ త్వరలోనే రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…